తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసిఆర్ సీఎం పదవిని రెండుసార్లు అధిరోహించారు. అయితే మొదటిసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కాస్త వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇక మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కుటుంబ పాలన అనే అంశం.. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్,హరీష్ రావు,కేటీఆర్,కవిత, సంతోష్ రావు ఇలా వాళ్ళ ఫ్యామిలీ వారే ఆధిపత్యం చెలాయించారని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ పార్టీని ప్రజలు ఈసారి అధికారానికి దూరం చేశారు. ఇదంతా బాగానే ఉన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కేసిఆర్ కసరత్తులు చేస్తున్నాడు. 

అంతేకాదు ఇదే తరుణంలో తన సొంత బిడ్డ అయినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లిక్కర్ స్కాం  కేసులో ఇరుక్కుంది.ఇది కూడా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే ఆమెను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అన్న కేసీఆర్ ఆమె ద్వారానే మళ్లీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసినట్టున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా బిఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించకపోవచ్చు. కొన్ని సీట్లు కాంగ్రెస్ కు వస్తే మరికొన్ని బిజెపి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరికొన్ని బిఆర్ఎస్ కు వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ బిజెపి పార్టీలను బీఆర్ఎస్ బీట్ చేయాలి.

దానికోసమే తెలంగాణలో మరో ప్రత్యామ్నయ పార్టీ రావాలి. ఇంతలోనే ఎవరైనా తెలంగాణలో పార్టీ పెడతారని భావించిన కేసీఆర్ తన సొంత కూతురుతోనే పార్టీ పెట్టించాలని భావించినట్టున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి అంటే కవితను దూరం పెట్టినట్టే ఉంచాలి. అలా కేసిఆర్ కు కవితకు తీవ్రమైన గొడవ జరిగినట్టు క్రియేట్ చేసి కొత్త పార్టీ పెట్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చేర్పించుకొని మళ్లీ ఎలక్షన్స్ లో వారినే బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. తండ్రి ఏ విధంగా ఉద్యమ భావజాలంతో  అధికారంలోకి వచ్చారో కవిత కూడా ఉద్యమ స్ఫూర్తితోనే పార్టీ పెట్టి కొన్ని సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు ఒకవేళ కవిత పార్టీ పెడితే కవిత ఇంకోవైపు, బిజెపి ఓసైడ్ పోటీ చేసి  సీట్లను విచ్చిన్నం చేసి చివరికి కవిత కేసీఆర్ కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే కేసిఆర్ ముందుకు వెళ్తున్నారని రాజకీయ మేధావులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ప్లాన్ గనుక వర్కౌట్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తప్పకుండా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం కేసిఆర్ కు కలిసి వస్తుందా లేదంటే అది బెడిసి కొట్టి కాంగ్రెస్ కే మేలు జరుగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: