
ఈ న్యూస్ బిఆర్ఎస్ నేతలను , కార్యకర్తలను ఆనందపరిచేలా ఉన్నది. అదేమిటంటే బిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత తండ్రి కెసిఆర్ ని కలవబోతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ కు ఆమె రాసిన లేఖ బిఆర్ఎస్ లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఇవాళ ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు మరి కొన్ని గంటలలో వెళ్లి మరి అక్కడ తన తండ్రికి వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన కవిత పార్టీ అధినేత కేసిఆర్ తో కూడా భేటి కాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాత్రి మీడియాతో మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ కవిత తాను తన తండ్రికి రాసినటువంటి లేఖ బయటికి ఎలా వచ్చిందనే విషయంపై తాను ఆశ్చర్యపోయానని.. ఈరోజు మధ్యాహ్నం తన తండ్రిని కలుస్తానని పార్టీ వర్గాలలో కూడా జరుగుతున్న చర్చలపై అన్నిటికీ క్లారిటీ ఇస్తానని తెలిపింది. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు కూడా అవే అంటూ తెలియజేసింది.కానీ అవి ఎలా బహిర్గతంగా బయటికి వచ్చాయని విషయంపై నేరుగా తన తండ్రి కెసిఆర్ తోనే మాట్లాడబోతున్నట్లుగా వినిపిస్తున్నాయి..మరి ఫామ్ హౌస్ లో అటు ఎమ్మెల్సీ కవితను బిఆర్ఎస్ నేతల మధ్య కెసిఆర్ రాజకుదురుస్తారా లేదా అన్న విషయం చూడాలి. ఈరోజు సాయంత్రానికి అన్ని విషయాల పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.