
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు గారు 1982, మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టీడీపీ రికార్డు సృష్టించింది. ప్రత్యర్థులను మట్టికరిపించి 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సంవత్సరం తిరుపతిలో టీడీపీ తొలి మహానాడు జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మహానాడును నిర్వహించారు. మహానాడు అంటే `విపుల సభ`. ఈ పదాన్ని ఎన్టీఆర్ స్వయంగా సూచించినట్లు చెబుతారు.
1983, మే 27 నుంచి 29 వరకు జరిగిన తొలి మహానాడు ఒక రాజకీయ మహాసభగా కాకుండా, ఒక ప్రజా ఉద్యమ వేదికగా కనిపించింది. నాడు ఎన్టీఆర్ చేసిన ప్రసంగం తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. `ఇదే మా ఖర్మభూమి, ఇదే మా ధర్మభూమి..` అంటూ ఆయన తెలుగు ప్రజల పట్ల తన నిబద్ధతను, సేవా భావాన్ని వ్యక్తపరిచారు. పార్టీ లక్ష్యాలను, విధానాలను, భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా వివరించారు. టీడీపీ తొలి మహానాడులో తన ప్రసంగం ద్వారా ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల మనసుల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు