
ఇలా మూడు రోజులు అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు పిలుపులు లేకపోవడంతో రాజకీయ వర్గాలను మరింత చర్చ నడుస్తుంది .. అయితే ఇప్పుడు తాజాగా సోమవారం సాయంత్రం 6, 7 గంటల సమయంలో కవిత నివాసానికి తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ నేత .. దీవకొండ దామోదర్‌రావు వచ్చారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది కూడా ఉండడం ఇక్కడ మరింత హాట్ టాపిక్ గా మారింది .. అయితే దీనిబట్టి కేసీఆరే దామోదర్‌రావును న్యాయవాదని కవిత వద్దకు పంపించారా ? అనే డిస్కషన్ మొదలైంది ..
కేసిఆర్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోదర్ రావు పార్టీ పరంగానే కాకుండా పత్రిక నమస్తే తెలంగాణ పరంగా కూడా ఎంతో దగ్గర .. పత్రిక స్థాపించింది కూడా ఆయన కనుసన్నల్లోనే ఇక ఆ తర్వాత కేసీఆర్ చొరవతోనే 2022లో రాజ్యసభలో అడుగు పెట్టారు .. దీంతో ఆయన్ను కేసిఆర్ ఆత్మగా సొంత మీడియాలో పిలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి కెసిఆర్ కు సన్నిహితుడుగా ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దామోదర్‌రావు ఇప్పుడు కవితనుకలుసుకునేందుకు వెళ్ళటం కొంత ఆశ్చర్యంగాను ఆసక్తిగాను మారింది .. అయితే ఆయన వెంట లాయర్ కూడా ఉండడంతో ఏదో పెద్ద ఎవ్వరమే నడుస్తున్నట్టు తెలుస్తుంది .. ఇక చివరకు రాజీ ధోరణకి వస్తారా లేక ఇంకేదైనా జరుగుతుందా అన్నది ఎవరికీ తెలియని అంతుచిక్కని ప్రశ్నగా మారింది .