- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

వల్లభనేని వంశీ కుటుంబం కొత్త రాజ‌కీయ ర‌గ‌డ .. పెను మార్పులు చోటు చేసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. వంశీ గ‌త మూడు ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే 2014 - 2019 లో గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యే గా పోటీ చేసి విజ‌యం సాధించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ చెంత చేరిన వంశీ ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆయ‌న ర‌క‌ర‌కాల కేసుల్లో జైలు శిక్ష సైతం అనుభ‌వించాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు గన్నవరం ఇంచార్జ్ గా వంశీ స్థానంలో ఆయన భార్యను నియమిస్తామని ప్రచారం వైసీపీ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. వంశీ భార్య పంకజశ్రీకి ఇంచార్జ్ గా ఇస్తారని వైసీపీ వర్గాలు లీక్ చేశాయి. వల్లభనేని వంశీ కేసుల్లో ఇరుక్కున్నందున ఆయన బయట తిరగడం కష్టమని .. దీనికి తోడు ఆయ‌న‌కు ఆరోగ్యం కూడా పెద్ద‌గా స‌హ‌క‌రించ‌డం లేద‌ని .. అయితే జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నందున ఆయ‌న‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా ఆయ‌న భార్య పంక‌జ‌శ్రీ కి ఇన్‌చార్జ్ పోస్టు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


వైసీపీలో గ‌తంలో ఇలాగే కొన్ని కుటుంబాల్లో ఇన్‌చార్జ్‌ల‌ను మార్చ‌డం వ‌ల్ల కుంప‌ట్లు చెల‌రేగాయి. టెక్క‌లి లో
దువ్వాడ శీను కుటుంబం నాశనం అయిపోయింది. ఎన్నిక‌ల‌కు ముందు దువ్వాడ శీను భార్య దువ్వాడ వాణికి ఇన్‌చార్జ్ ఇచ్చి చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు తిరిగి శీనుకే టిక్కెట్ ఇస్తే ఆయ‌న ఓడిపోయారు. ఇక బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా జైలుకు వెళ్ల‌డంతో ఆయ‌న భార్య బేబీ అయితే ఏకంగా హోం మినిస్ట‌ర్ అనే లెక్క‌లు వేసుకుంటున్నారు. ఇలా వైసీపీ నేత‌లు కేసుల్లో చిక్కుకోవ‌డంతో కుటుంబాలు చీలి పోతున్నాయి. ఇప్పుడు వంశీ ప్లేస్ లో ఆయ‌న భార్య‌కు ఇన్ చార్జ్ ప‌ద‌వి ఇస్తే రాజ‌కీయ‌మే ప్ర‌వృత్తిగా మార్చుకున్న వంశీ ఊరుకుంటారా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వంశీకి ఇప్పుడు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఒక్క కేసులో మాత్రమే పెండింగ్ ఉండ‌గా పీటీ వారెంట్లు వేసే అవ‌కాశం లేదు. అయితే వంశీ వ‌ర్గీయుల్లో అనుమానం కూడా ఉంది. పంక‌జ‌శ్రీకి ఇన్‌చార్జ్ ఇస్తార‌ని ప్రచారం చేసి చివరికి దుట్టా కుటుంబానికి చాన్స్ ఇస్తారని కూడా అనుమానిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: