
జూన్ 4వ తేదీన మన వాకిళ్లను రంగుల మయంతో అలంకరించాలి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించాలి.. ఈ మేరకు పార్టీ నాయకులు వీర మహిళలు కార్యాలయాలకు రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈనెల 4న సంక్రాంతి ,దీపావళి పండుగను జరుపుకునేలా చేద్దాము అంటూ తెలిపారు. ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి అంటూ డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
అలాగే ఏపీలో వైసిపి పీడ విరగడ ఏడాది కావస్తు ఉన్న సందర్భంగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలి అంటూ పార్టీ శ్రేణులకు కూడా జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అందుకు సంబంధించి జనసేన పార్టీ కార్యదర్శి పి హరి ప్రసాద్ జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వం లో ఏపీ అభివృద్ధిలో వెనక పడిందని మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతుంది కూటం ప్రభుత్వం వల్ల అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీలను అమలు చేస్తున్నామంటూ తెలియజేశారు. పిఠాపురంలో కూడా పలు సభలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.