2019 ఎన్నికల ముందు అప్పటి టిడిపి గవర్నమెంట్ లో కాపు రిజర్వేషన్ ఉద్యమ కేసుల ఎత్తివేత పై .. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంచల నిర్ణయం తీసుకుంది .. కేసులు ఎత్తివేత పై హైకోర్టులో ఆపిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నిటికీ గత వైసిపి ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే .. ఏ ఒక్క కేసు లేకుండా ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు .. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఓ జీవోను కూడా విడుదల చేశారు .. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరిచారు .. అలాగే పోలీస్ స్టేషన్ల పేరులు ,కేసుల నెంబర్ల జాబితానికి కూడా ప్రకటించారు .. ఆ సమయంలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే .. అలాగే తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు ..


ఆ హామీ అసలు అమలు కావటం లేదని దానికి నిర‌స్తూ ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు మాజీమంత్రి ముద్రగడ్డ ప‌ద్మనాభం సారధ్యంలో ఆ సామాజిక వర్గ ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు .. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.. తునిలో సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు కూడాా జరిగాయి .. ఈ అల్లర్లలో రత్నాచల్  రైలను కూడా తగలబెట్టేశారు .. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు .. వివిధ పోలీస్ స్టేషన్లో వేరువేరు సెక్షణలు కింద కేసులు కూడా నమోదయ్యాయి తుని బహిరంగ సభ తర్వాతవాత .. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యాయి .. అలాగే తునిలో రైళ్లు తగలబెట్టడం స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడులు చేయడం వంటివి ఘటనలకు సంబంధించిన పలు కేసులు కూడాా నమోదయ్యాయి .. క్రిమినల్ లా అమెండ్మెంట్ అప్పటి ఐపిసి సెక్షన్ల కింద కేసులు పెట్టారు .. అయితే తర్వాత 2019 జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులు అన్నిటిని వెనుక తీసుకోవడం మొదలైంది .. మొదటి దశలో తుని బహిరంగ సభ రైలు దగ్ధం పోలీస్ స్టేషన్ పై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది ..


అలాగే 2020 జూలైలో దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు .. ఆ తర్వాత తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 19 వరకు నమోదైన కేసులు అన్నిటిని ఎత్తివేస్తూ అప్పటి హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది .. ఈ మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు అన్నిటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది .  ఇక 2019 మార్చ్ వరకు 161 కేసుల నమోదు అయినట్లు కూడా చెప్పుకొచ్చింది ..వీటి అన్నిటిని కూడా ఎత్తివేసింది .. అయితే ఇప్పుడు వీటన్నిటి పైన హైకోర్టు కు ఆపిల్ కి వెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాపు ఉద్యమకారుల పై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పై ఆపిల్ కు వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .. ఇప్పటికి హైకోర్టులో ఆపిల్ చేయాలని ప  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఇస్తూ తాజాగా హోం శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది .. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో .. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారు లపై ఎత్తివేసిన కేస్తుల పై ఆపిల్ కు వెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఆయన ఏవిధంగాా స్పందిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోప్రాధాన్యతను తెచ్చుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: