
డ్రగ్స్, గంజాయి వంటి మత్తుమందుల బారిన యువత పడకుండా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటుంది. ఏపీలో వైసీపీ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మాదక ద్రవ్యాల నియంత్రణకు పనిచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈగల్ టీం దిగింది ఇప్పుడు. అదేవిధంగా ఏపీ సర్కార్ మత్తు పదార్థాలకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త ఆవిష్కరణకు కూడా రెడీ అయింది. వీఎంఆర్డిఏ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ పార్క్ నిర్మించేందుకు నిర్ణయించింది.
విశాఖ సెంట్రల్ పార్క్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ. 3.5 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి యాంటీ డ్రగ్ పార్క్ నిర్మించబడుతోంది . ప్రస్తుతం వీఎంఆర్డిఏ ఈ పార్క్ కోసం టెండర్లను ఆహ్వానిస్తోంది. ఇకపోతే నిర్మాణం అనంతరం ఈ పార్క్ లో యువతను లక్ష్యంగా చేసుకుని 15 నిమిషాల వీడియో ప్రదర్శనలు, కౌన్సిలింగ్ కేంద్రాలు మరియు సైకాలజీ తరగతులు నిర్వహించబడతాయి.
అలాగే ఈ యాంటీ డ్రగ్ పార్క్ ను పచ్చదనం, విద్యుత్ కాంతుల మొక్కలు, జంతువుల ఆకృతులు, మరియు వాటర్ ఫౌంటెన్లతో ఎంత ఆకర్షణీయంగా రూపొందించనున్నారు. డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలు, మత్తుపదార్థాలకు బానిసగా మారితే కలిగి నష్టాలను అనుభవపూర్వకంగా వివరించనున్నారు. డ్రగ్స్ లేని జీవితం ఎంత అందంగా ఉంటుందో తెలిపేందుకు పార్క్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్ ను కూడా అమలు చేయనున్నారు.