ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీవ్రమైన విమర్శలకు కారణం అవుతుంది. ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెబితే ఎలా ఉంటుంది ? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా ఉంటుంది ? అదే ఇప్పుడు ఐక్యరాజ్యసమితి చేస్తుంది. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన పాకిస్తాన్ కు ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను ఐక్యరాజ్యసమితి అప్పగించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది. ఎందరో కరుడు గట్టిన ఉగ్రవాదులకు ఆశ్రయమించిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపికైంది. తాళిబన్ల‌ ఆంక్షలు కమిటీ పగ్గాలు ఆదేశానికే ఇవ్వటం ఎప్పుడు అందరిని తీవ్ర విస్మ‌యానికి గురిచేస్తుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు భవిష్యత్తులో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలన పై పాఠాలు చెప్పినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ? ఈ రెండు కమిటీల్లో లభించిన కీలక ప‌ద‌వుల‌తో ఆ దేశం చాలా మంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రమాదం కూడా ఉందని అందరూ అనుమానిస్తున్నారు.


మరి ముఖ్యంగా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా పాకిస్తాన్ నిర్ణయాలు తీసుకోవడంతోపాటు భారత్ ఇరుకున ప‌డుతుందని అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధిక కమిటీ చైర్మన్ పదవిపై పాకిస్తాన్ కన్నేసింది. చివరకు వైస్ చైర్మన్ హోదాతో సరిపెట్టుకుంది. అయితే తాలిబన్ ఆంక్షలు కమిటీ ప‌గ్గాలను దక్కించుకోవడం ప్రస్తుతం ఉన్న సమయంలో పాకిస్తాన్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా అందరు భావిస్తున్నారు. తాలిబన్లతో ఇస్లామాబాద్‌కు సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ దగ్గరవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాబూల్‌కు దగ్గర అయ్యేందుకు ఈ ఆంక్షలు కమిటీ చైర్మన్ పదవిని పాకిస్తాన్ ఉపయోగించుకోనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: