
మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు 2012 ఉప ఎన్నికలు, 2014, 2019, 2024 ఎన్నికలలో రాయచోటి నియోజకవర్గంలో పోలైన ఓట్లను సైతం పరిశీలించాలి అంటూ తెలియజేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పార్టీకి సుమారుగా 62,000 నుంచి 66000 కోట్లు వచ్చాయని.. ఆ సమయంలో వైసీపీకి 92 నుంచి 98 వేల ఓట్లు వచ్చాయని వెల్లడించారు. 2014తో పోలిస్తే 2019లో ఓట్ల పెరుగుదల కేవలం 200 ఓట్లు మాత్రమే ఉందంటూ తెలియజేశారు.
కానీ 2024 లో మాత్రం ఓట్ల సంఖ్య ఏకంగా 30 వేలకు పెరిగింది అంటూ వివరణ ఇచ్చారు.. దీనిపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ తెలియజేశారు.. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీకి 95 వేల ఓట్లు వచ్చాయని టిడిపికి 96 వేల ఓట్లు వచ్చాయని గణాంకాలను తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగానే ఉన్న అదనంగా పోలైన 30 వేల ఓట్లు పూర్తిగా టిడిపికి ఎలా వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదంటూ అందుకు ఇదే సాక్ష్యం అంటూ ప్రశ్నిస్తూ ఒక ట్విట్టర్ ద్వారా తెలిపారు.. ఓట్ల పెరుగుదల అనేది ఇలా ఒక పక్షాన జరిగింది అంటే ఇందులో లోటుపాట్లు ఉన్నాయేమో అన్నట్లుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయంగా తెలియజేశారు శ్రీకాంత్ రెడ్డి. ఈ పోస్టుతో ఇప్పుడు ఒక్కసారిగా రాయచోటి నియోజకవర్గం లో చర్చించుకునేలా జరుగుతున్నాయి.