గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే .. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది . అయితే ఈ ప్రమాదం జరిగే సమయంలో ఇద్దరు పైలట్లు , 10 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు .. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి .. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోని రన్వే నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం బయలుదేరింది . అయితే విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి విమానం నడిపే పైలెట్ MAYDAY కాల్ చేశాడు .. అయితే ఆ సమయంలోATC కి ఎలాంటి సిగ్నల్ అందలేదు అలా చివరి నిమిషంలో విమానం అక్కడే కూలిపోయింది .

MAYDAY కాల్ అనేది విమానం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు .. ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు ఫ్లైట్ ఇచ్చే అత్యవసర సందేశం .  అలాగే  ఇంజిన్ ఇంజన్ పనిచేయకపోవడం , విమానం మంటల్లో చిక్కుకోవడం , గాల్లో ఢీకొనే ప్రమాదం లేదా ఇతర ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలెట్ MAYDAY కాల్ చేస్తారు .  ఆ కాల్ ద్వారా ATC  వెంటనే తక్షణ సహాయం అవసరమని సిబ్బందిని హెచ్చరిస్తాడు .. ప్రధానంగా విమానం రేడియోలో మూడుసార్లు MAYDAY అని చెబుతారు .. ఈ కాల్‌ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ ముందుగా ఆ విమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది .  అలాగే అత్యవసరం ల్యాండింగ్ అనుమతి, రన్‌వే క్లియర్ చేయడం, అంబులెన్స్ , అగ్నిమాపక సిబ్బందిని అంతా రెడీగా ఉంచడం లాంటి సాయం చేస్తుంది .. అయితే MAYDAY అనే పదం ఫ్రెంచ్ పద‌మైన మైడర్ నుంచి తీసుకున్నారు .. దాని అర్థం నాకు సాయం చేయండి అని అర్థం వస్తుంది ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: