
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇది పుష్ప సినిమా లోని డైలాగ్ పెట్టిన తప్పేనా? అసలు పుష్ప మాదిరి గడ్డం అన్నా కూడా తప్పే? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? అనే విషయాన్ని ప్రశ్నించారు.అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా జగన్ నిన్నటి రోజున పల్నాడు జిల్లాకు వెళ్లడంతో అక్కడ పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా కూడా వైసీపీ కార్యకర్తలు నేతలు మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
మీడియాతో జగన్ మాట్లాడుతూ ఏపీ అంతట రేపు బుక్ రాజ్యాంగం నడుస్తోందని అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యం పైన ప్రశ్నిస్తే వైసిపి కార్యాలయం పైన నేతల పైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని హెచ్చరించారు. వైయస్ జగన్ రెంటపాళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కార్యకర్తలు ఫ్లెక్సీలను ఇలా ప్రదర్శించారు.. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే.. గంగమ్మ జాతరలో వేద తలలు నరికినట్టుగా రఫ్ఫా రఫ్ఫా నరుకుతాము అంటూ ఫ్లెక్సీలను పట్టుకున్నారు.. అంతేకాకుండా అన్న వస్తాడు అంతు చూస్తాడు.. జగన్ 2.O , ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటూ వైసిపి కార్యకర్తలు ఫ్లెక్సీలను ప్రదర్శించడంతో వీటి పైన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ పట్టుకున్న వ్యక్తి టిడిపికి సంబంధించిన సభ్యత్వం కూడా కలిగి ఉన్నారని రిపోర్టర్లు తెలియజేశారు. చంద్రబాబు మీద కోపంతోనే ఆ టిడిపి కార్యకర్త అలా చేసి ఉంటారని ఇన్ని మోసాలు చేసిన తర్వాత ఎవరైనా ఉంటారా వైసిపి లోకి మారడం చాలా సంతోషం అంటూ తెలిపారు.