అమెరికా డైరెక్టుగా రంగంలోకి దిగ‌డంతో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇరాన్ కు అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆ దేశం వీటిని లైట్ తీస్కొంది. ఇక ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించ‌డంతో.. ఇది ఇంత తొంద‌ర‌గా జ‌రుగుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. రెండు వారాలు గ‌డువు ఇస్తున్న‌ట్టు చెప్పిన ట్రంప్ క‌నీసం రెండు రోజులు కూడా ఆగ‌లేదు. గత ప‌ది రోజులుగా ఇజ్రాయెల్- ఇరాన్‌ ల మధ్య దాడుల్లో ఇరాన్ పలు విభాగాల్లో దారుణంగా దెబ్బతింది. అమెరికా జోక్యంపై ఇరాన్ వార్నింగ్ ఇచ్చినా అమెరికా రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఇరాన్ టార్గెట్‌లో అమెరికా కూడా ఉండ‌బోతోంది.


ఇరాన్ అణుకేంద్రాలు దెబ్బ‌తీసిన ట్రంప్‌.. త‌మ ప‌ని ముగిసింది ... ఇక ఇరాన్ శాంతికి సిద్ధం కావాలి అంటూ  పిలుపునిచ్చారు. ఇరాన్ లో అణు కేంద్రాలు టార్గెట్ గా దాడులు పూర్తి చేసి తమ విమానాలు సురక్షితంగా వెనక్కి వచ్చాయని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఇరాన్ అణు వ్యవస్థ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా తీవ్ర‌ ఆందోళనలు రేకెత్తిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని మధ్య ప్రాచ్యంలో మిగిలిన దేశాల‌తో త‌మ సంబంధాల స్థిరత్వానికి ముప్పుగా భావిస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్ మిస్సెల్స్ ఎటాక్ ప్రారంభించి ఇరాన్ ను రెండు వైపులా నుంచి దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. అమెరికా దాడులను ముందే ఊహించిన ఇరాన్ తన అణు స్థావరాల నుంచి కీలక సామాగ్రిని, యురేనియం నిల్వలను అక్కడ నుంచి సేప్ ప్లేస్‌ల‌కు మార్చేసిన‌ట్టు టాక్ ?


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: