
తెలంగాణ బిజెపి మెదక్ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరు తో ఫోన్ చేసి బెదిరించారు . ఇవాళ సాయంత్రం లోగా ఎంపీ ను చంపేస్తామంటూ హెచ్చరించారు .. మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని ఓ అగాంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఆ ఫోన్ కాల్‌నీ రఘునందన్ రావు పిఏ లిఫ్ట్ చేశారు .. ఇక 912143352974 ఈ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని దమ్ముంటే కాపాడుకోండి అంటూ రఘునందన్ రావుని అగాంతకుడు బెదిరింపులకు గురి చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది .
అలాగే సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు .. పలు అభివృద్ధి కార్యక్రమాలలోనూ ఎంపీ పాల్గొన్నారు .. అయితే ఈ సమయం లోనే రఘునందన్ రావు కి తెలియని ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చిందని . ఆ వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్‌కి రెడ్డికి , సంగారెడ్డి ఎస్పీకి ఇతర ఉన్నతా అధికారులకు ఫిర్యాదు చేశారు .. అలాగే రఘునందన్ ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలు పెట్టారు . ఆ ఫోన్ కాల్ నెంబర్ ఆధారంగా విచారణ కూడా మొదలు పెట్టారు . ఎక్కడి నుంచి ఆ కాల్ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు . అదే విధంగా ఈ విషయం పై బీజేపీ అగ్ర నేతలు ఎంపీ రఘునందన్ రావు కి ఫోన్ చేసి వివరాలు అడిగి మరి తెలుసుకున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు