
అయితే ఈ తొక్కిసలాటలో చాలామంది కంప్రెస్సివ్ అన్ఫిక్సియాతో ఇబ్బందిపడి మరణించారని వైద్యులు వెల్లడిస్తున్నారు.. ముఖ్యంగా ఈ తొక్కేసలాట తోపులాటలో ఛాతి భాగాలకు చాలా బలంగా ఒత్తిడి పెరిగిపోవడం వల్లే ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలకు చాలా ఇబ్బంది కలిగిందని, దీనివల్ల ఊపిరితిత్తుల పైన ఒత్తిడి పెరిగి గాలిలోపలికి ప్రవేశించలేకపోయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయని తెలుపుతున్నారు.. వాస్తవంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే రెండు లేదా మూడు నిమిషాల వరకు ఆక్సిజన్ లేకపోతే బతకడం కష్టం.. ముఖ్యంగా పిల్లలు 30 నిమిషాలలోపే తీవ్ర ప్రభావానికి గురవుతారని తెలిపారు.
అంతేకాకుండా కొంతమంది ఊపిరితిత్తులలో స్కానింగ్ చేసినప్పుడు పగుళ్లు (చీలికలు) కనిపించాయంటూ తెలిపారు వైద్యులు.ఈ రకమైన ఒత్తిడి వల్ల గుండె చుట్టూ రక్తస్రావానికి కారణమై ఉంటుందని తెలుపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ తొక్కిసలాట ఎంత తీవ్రంగా జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ తెలుపుతున్నారు. ఆ సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి మృతులు చాలా రకాలుగా ప్రయత్నించిన ఊపిరితిత్తుల సహకరించకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులతో పాటుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి స్కానింగ్, ఎక్సరే రిపోర్టులు వైద్య బృందం పరిశీలించగా.. వారి యొక్క పక్కటెముకలు, వెన్నుముకలు విరిగినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు 41 మంది మృతుల్ని ప్రకటించారు. మృతిచెందిన వారిలో చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలుపుతున్నారు. ఈ సంఘటన పైన టీవీకే పార్టీ నేతలు కార్యకర్తలు పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు