
అదేవిధంగా తెలంగాణలోని మందొళ్లగూడెం నుంచి నార్కట్‌పల్లి వరకు ఎన్ హెచ్ 65 పై 47.50 కి.మీరా సగటున రోజుకు 61 వేల వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయని కూడా తెలిపింది . అదే విధంగా నార్కట్‌పల్లి నుంచి సూర్యాపేట బైపాస్ వరకు 41 కిలోమీటర్ల మేర సగటున్న రోజుకు 51 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి .. అదే విధంగా సూర్యాపేట బైపాస్ నుంచి కోదాడ వరకు 51 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్- 65 పై రోజుకు 33 వేల వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి .. అలాగే కోదాడ నుంచి నందిగామ వరకు 42 కిలోమీటర్ల మేర రోజుకు 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి .. అలాగే నందిగామ నుంచి గొల్లపూడి వరకు 44.5 కిలోమీటర్ల మేర రోజుకు 35వేల వాహనాలు నడుస్తున్నట్టు తెలిపింది .. అలాగే కేంద్రానికి పంపించిన ట్రాఫిక్ గణాంకాల ప్రకారం 8 వరసలుగా రోడ్‌ను విస్తరించాలని కన్సల్టెన్సీ సంస్థ గట్టిగా ప్రతిపాదించింది .. అయితే కేంద్రం మాత్రం 6 వరసలకు ప్రతిపాదించడం అన్యాయం చాలా దారుణమంటూ అభిప్రాయాలు వస్తున్నాయి .. అయితే జాతీయ రహదారిపై ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తే ఎన్ని లైన్లు అనుమతులు ఇవ్వాలనే దానిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) కొన్ని నిబంధనలను పెట్టుకుంది .
వాటి ప్రకారం 20 వేల నుంచి 30 వేల వాహనాలు రాకపోకలు సాగించే మార్గాన్ని 8 లైన్లో స్ట్రక్చర్ తో ఆరు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలి .. అదేవిధంగా 30 వేల నుంచి 40 వేల వాహనాలు కనుక రాకపోకలు సాగిస్తే ఖచ్చితంగా 8 లైన్లో హైవేను అభివృద్ధి చేయాలి .. అయితే 40 వేల వాహనాలు ఆపైన రాకపోవహులు సాగిస్తే .. ఆ హైవేను రెండు లైన్లుగా ఉంటే 12 లైన్ల విస్తరణకు కూడా పరిగణలోకి తెచ్చుకోవచ్చు .. ఇక ప్రస్తుతం ఎన్హెచ్65 .. నాలుగు లైన్లుగా కొనసాగుతుంది కాబట్టి 8 లైన్లో తగ్గకుండా హైవే ను విస్తరింప చేయాలి .. అదే విధంగా 40 వేల పైబడి వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి .. హైవేను ప్రస్తుతం 4 లైన్లుగా ఉంటే 8 లైన్లుగా విస్తరించాల్సి ఉంటుంది .. మోర్తు నిబంధన ప్రకారం హైదరాబాద్ - విజయవాడ మార్గాన్ని 8 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం కేవలం 6 లైన్లుగానే ప్రతిపాదించడం ఇక్కడ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది .. ఈ విధంగా ఎందుకు నిర్ణయం తీసుకుంది అనే దాంట్లో మాత్రం కొంత రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి .. ఇక మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ఎన్ హెచ్ 65 హైవే విస్తరణ పై కేంద్రంతో చర్చలు జరిపి సరైన నిర్ణయం వచ్చేలా ప్రతిపాదించాలని కూడా అంటున్నారు .. ఇక మరి కేంద్రం నిర్ణయం పై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .