
రీల్స్ పిచ్చితో ఎక్కువ సంఖ్యలో వ్యూస్ రావాలని యువతి చేసిన పని ఆమె కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేసిందని చెప్పవచ్చు. నాగులాపల్లి ప్రాంతంలో స్థానికులు యువతి కారును అడ్డుకున్నారు. అయితే తన కారును ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తులను యువతి కారుతో బెదిరించినట్టు సమాచారం అందుతోంది. మద్యం మత్తులో యువతి కారు నడిపింది ప్రాథమికంగా సమాచారం అందుతోంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. యువతి నిర్వాకం వల్ల రైళ్ల రాకపోకలకు గంటల తరబడి అంతరాయం కలిగిందని తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగిందని సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి యువతులను కఠినంగా శిక్షిస్తే మాత్రమే పరిస్థితి మారే అవకాశం ఉంది.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పనులు చేసే ఇలాంటి వ్యక్తులకు కనీసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు శిక్ష విధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ ప్లేసెస్ లో రీల్స్ చేయకుండా నిబంధనలు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ట్రాక్ పై కారుతో అతి వేగంగా వెళ్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి. ఆమెకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.