వైసీపీలో ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుంది .. ఆ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గురించి పార్టీ ముఖ్య నేతల మధ్య ఆసక్తికర చర్చ‌ నడుస్తుంది .  ప్రధానంగా జగన్ లండన్ లో ఉన్న సమయంలో వైసీపీకి ... రాజకీయాలకు విజయసాయిరెడ్డి దండం పెట్టి పక్కకు వెళ్లిపోయారు .. ప్రధానంగా జగన్ వద్ద ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని సాయి రెడ్డి చెప్పుకొచ్చారు .. అలాగే ఆ తర్వాత లిక్కర్ స్కాం .. కాకినాడ పోర్ట్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు .. అలాగే ఆ సమయంలో తాను జగన్ కు నష్టం చేసే విధంగా ఎక్కడ వ్యవహరించ‌న‌ని కూడా చెప్పుకొచ్చారు .. అయితే ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి విషయంలో జగన్   ఓ సంచల నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది .. విజయసాయి రెడ్డితో జగన్ తరుపు సందేశం వెళ్లిందని .  త్వరలోనే సాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ..


వైసీపీలో విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఫిక్స్ అంటూ పార్టీలో గట్టిగా చర్చ కూడా జరుగుతుంది .  వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సాయి రెడ్డి వైసీపీని వదిలి వెళ్లిపోయాక‌ .. అలాగే రాజశేఖర్ రెడ్డి హయాంలోనే సాయి రెడ్డికి ఎంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది .  ఆ స‌మ‌యంలోని టీటీడీ బోర్డు నెంబర్ గా , ఓబిసి డైరెక్టర్గా కూడా వ్యవహరించారు .. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కు మద్దతుగా ఉంటూ .. జగన్ తో పాటు జైలుకు కూడా వెళ్లారు .. ఇలా వైసీపీలో క్రియాశీలకంగా మారారు .. అలాగే వైసిపి నుంచి తొలి రాజ్యసభ సభ్యుడిగా సాయిరెడ్డి ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు పెంచుకున్నారు .  అలాగే వైసిపి ఢిల్లీ మధ్య సంధాన కర్తగా కూడా మారారు .. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కేంద్రం - ఏపీ మధ్య కీలకంగా ఆయన వ్యవహరించారు .



అయితే 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత అంతా సీన్‌ మారి .. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చోట చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి కొంత మనస్థాపానికి లోనయ్యారు .. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు విజయసాయి .. ఆ తర్వాత పార్టీలు తీసుకుంటూన్న‌ నిర్ణయాలు సాయి రెడ్డికి అసలు నచ్చలేదు .. అలాగే జగన్ లండన్ లో ఉన్న సమయంలోనే పార్టీకి రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్తున్నాడు సాయి రెడ్డి ప్రకటించారు .. ప్రధానంగా జగన్ కోటరీ కారణంగానే అంటూ ఆయన వైసీపీ జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు .. ఇక తర్వాత విజయసాయిరెడ్డి కూటమిలో చేరుతున్నారని ప్రచారం కూడా వచ్చింది .. ప్రధానంగా బిజెపిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి .. మద్యం స్కాం, కాకినాడ పోర్టుల‌ విచారణకు హాజరైన సాయిరెడ్డి  చేసిన వ్యాఖ్యలు కూడా ఆ స‌మ‌యంలో హాట్‌ టాపిక్ గా మారాయి .

 

ఇలా విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పి పార్టీ విరడం పైన జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ సమయంలో కొంత వైరల్ గా మారాయి .. అయితే విజయ సాయి రెడ్డి వైసీపీ కోసం ఎంతో చేశారని .  ఆయన సేవలు పార్టీకి అవసరమైన చర్చ పార్టీ నాయకుల్లో బాగా జరిగింది .. మారుతున్న రాజకీయ సమీకరణల‌ నేపథ్యంలో సాయి రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే బాగుంటుందనే ప్రస్తావన‌కు జగన్ వద్ద ఓ ముఖ్య నేత కీల‌కంగా ప్రస్తావన చేసినట్టు తెలుస్తుంది .. అలాగే సాయి రెడ్డి పార్టీలోకి వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ కూడా అతనితో అన్నట్టు కూడా తెలుస్తుంది .. దీంతో ఆయన సాయి రెడ్డితో చర్చించారని .. జగన్ పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని సాయి రెడ్డి చెప్పినట్టు పార్టీ ముఖ్య నేతల్లో కూడా చర్చ నడుస్తుంది .. ఇక దీంతో అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే విజయ్ సాయి రెడ్డి తిరిగి మళ్ళీ వైసీపీలో చేర‌డానికి రంగం రెడీ అవుతున్నట్టు పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం .. అయితే ఈ విషయం పై అసలు సాయి రెడ్డి నిర్ణయం ఏంటి .. తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ కి రెడీగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: