
ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్చార్జిగా పరుపుల తమ్మయ్య ఉండగా సస్పెండ్ కూడా చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ను సిబ్బందిని సైతం బెదిరించారనే ఆరోపణ రుజువు అవడంతో జనసేన పార్టీ నుంచి తప్పించారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గంలో బాధ్యతలను క్రాంతి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీకి సంబంధించి నియోజకవర్గం కూడా క్రాంతి యాక్టివ్గా అయ్యే ప్రయత్నాలు చేస్తానని రెగ్యులర్ గా కూడా నియోజకవర్గంలో తాను తిరుగుతానని కేడర్కు తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రతిపాడు వైసిపి కోఆర్డినేటర్ గా ముద్రగడ కుమారుడు అయిన గిరి ఉన్నారు.. ఇప్పుడు మళ్లీ తిరిగి అదే నియోజకవర్గానికి గిరి సోదరి క్రాంతి కూడా జనసేన పార్టీ నుంచి యాక్టివ్గా కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2024 ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం కూడా జనసేన పార్టీలోకి చేరుతారని చాలా ప్రచారం జరిగింది కానీ చివరికి వైసీపీ పార్టీలో చేరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గత కొద్దిరోజులుగా ముద్రగడ అనారోగ్యం పాలవ్వగా గిరి తన సోదరి క్రాంతి మీద పలు రకాల ఆరోపణలు చేసింది. అయితే వాటన్నిటికీ కూడా ముద్రగడ క్లారిటీ ఇస్తూ కొన్ని పోస్టులు కూడా చేయడం జరిగింది. ఒకవేళ ప్రతిపాడు నియోజవర్గ ఇన్చార్జిగా క్రాంతి వస్తే మరి ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.