పోయిన ఏడాది జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీ కూటమి చేతుల్లో చాలా ఘోరంగా ఓడిపోయింది. కేవలం వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వైసిపి పార్టీని ఎదుర్కోవాలి అంటే సింగల్ గా పోటీ చేస్తే కష్టమని భావించుకున్నటువంటి నేతలు అందరూ కూడా కూటమిగా ఏర్పడ్డారు. అలా టిడిపి, జనసేన ,బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి 164 సీట్లతో విజయాన్ని అందుకున్నారు. ఊహించలేదు. ఇక వైసిపి కూడా జీర్ణించుకోలేని ఓటమి చవిచూశారు.


2019లో 151 సీట్లతో సరికొత్త రికార్డులు సృష్టించిన రాజకీయ పార్టీగా వైసిపి అధికారంలోకి వచ్చింది. కానీ 2024లో కేవలం 11 స్థానాలతో ప్రతిపక్ష హోదాను కూడా అందుకోలేకపోయింది ఈ ఓటమి పైన తాజాగా తెలంగాణ మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. 2024 జరిగిన ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం తనని చాలా ఆశ్చర్యానికి గురి చేసిందంటూ వెల్లడించారు. ఢిల్లీలో ఇటీవలే మీడియాతో ఒక చిట్ చాట్ చేసిన కేటీఆర్ జగన్ ఓటమి పై మాట్లాడారు.



గతంలో కూడా తాను వెన్న సందర్భాలలో జగన్ ఓటమి పైన మాట్లాడడం జరిగింది కేటీఆర్. జగన్ ఓడిపోవడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిందని అది ఓడినా కూడా 40% ఓటింగ్ రావడం అంటే అది మామూలు విషయం కాదంటూ తెలిపారు. 2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించారంటూ కేటీఆర్ తన అభిప్రాయంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరొక లాగా ఉండేవేమో అంటూ వెల్లడించారు. ఇక షర్మిలను జగన్ను ఓడించడానికి పావుల వాడుకున్నారని అంతకుమించి ఆమె పాత్ర పెద్దగా ఎక్కడ ఏమి కనిపించలేదంటూ తెలిపారు. కానీ ప్రతిరోజు జనంలో తిరిగి కేతిరెడ్డి సైతం ఓడిపోవడం తనని మరింత ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కేటీఆర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: