
అయితే ఆ సమయంలో తన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో తన జీవితంలో జరిగిన పీటీఎం జ్ఞాపకాలను లోకేష్ గుర్తుచేసుకున్నారు .అందులో భాగంగా తాను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ మీటింగ్స్ కు తన తండ్రి చంద్రబాబు ఎప్పుడు రాలేదని . తన తల్లి భువనేశ్వరి మాత్రమే వచ్చేవారిని చెప్పుకొచ్చారు. కానీ మీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు మాత్రం ఏకంగా సీఎం చంద్రబాబు హాజరయ్యానని లోకేష్ విద్యార్థులతో అన్నారు .. ఇదే క్రమంలో ఇప్పుడు తన కుమారుడు దేవాన్ష్ పేరెంట్ టీచర్స్ మీట్ కు తాను కూడా వెళ్లలేకపోతున్నానని , తన భార్య బ్రాహ్మణి మాత్రమే వెళుతుందని చెప్పుకొచ్చాడు ..
ఇక ఈ విధంగా తన స్కూల్ డేస్ నుంచే తన తండ్రి ప్రజాసేవకు అంకితమైపోయిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ .. నేడు తాను అదే రూట్ లో ఉన్న విషయాన్ని తలుచుకుంటూ లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు .. అలాగే ఇదే క్రమంలో నాడు తాను తన తండ్రి తో పాటు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వద్ద తీసుకోవాల్సిన ఫోటోను .. నేడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తన తండ్రి తో మంత్రి హోదాలో ఉన్న లోకేష్ ఫోటో దిగారు .. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఇక దీని పై నాడు లోకేష్ మిస్ అయింది .. ఇప్పుడు దొరికింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఫోటోను వైరల్ చేస్తున్నారు ..