
జగన్ తన వ్యాఖ్యల్లో టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో హారికపై దాడితో పాటు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై, నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. ఈ దాడులను చంద్రబాబు రాజకీయ కక్షలతో ప్రేరేపితం చేస్తున్నారని, పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులను హింసిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనల్లో దోషులపై చర్యలు తీసుకోకపోవడం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టడం రాష్ట్రంలో న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తోందని జగన్ విమర్శించారు.ఈ దాడులు రాష్ట్రంలో రాజకీయ హింసను పెంచుతున్నాయని, చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం గాయపడుతోందని జగన్ హెచ్చరించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు రాజకీయ కక్షలతో రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని సృష్టిస్తున్నాయని, ఇది దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు