నారా లోకేష్ మిస్టర్ కూల్ పొలిటిషన్ గా మారిపోయారు. ఎలాగా అంటే తాజాగా ఈ భాషా వివాదం వస్తోంది కదా..తమిళనాడులో వచ్చింది, మహారాష్ట్రలో వచ్చింది. తమిళనాడులో అక్కడ స్టాలిన్ కావాలని రేపుతున్నారు. వాస్తవానికి మోడీ వ్యతిరేక శక్తులు భాషను ఒక అస్త్రంగా చేసి హిందువుల మధ్య విభజన చేసే అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఒక స్ట్రాటజీక్ గా మలిచినట్లుగా తెలుస్తోంది. దాంట్లో ఎవరి పక్షాన ఉండకుండా తెలివిగా ఆయన ఒక పదం ఉపయోగించారు. ఈ విషయం విన్న నేతలు కార్యకర్తలు నారా లోకేశ్ తెగ పొగిడేస్తూ ఉన్నారు.



ఏ భాష అయినా మాట్లాడుకోండి, ఏం బట్టలైనా వేసుకోండి, ఏ ఆహారమైన తినండి. అవన్నీ ఎవరి ఇష్టం వారిది. ఎవరి సంస్కృతి వారిది. మేము వాటన్నిటినీ కూడా గౌరవిస్తాము. అన్ని సంస్కృతిని గౌరవిస్తాము.. మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోండి. మా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యుల కండి. కమ్ బిల్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ నారా లోకేష్ ఇచ్చినటువంటి పిలుపు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇలాంటి విషయాలలో జాతీయ వ్యవస్థలు కూడా మిస్టర్ కూల్ అంటూ తనని ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాయి.



2024 ఎన్నికల సమయానికి  టిడిపిలో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్రకు  బారి స్థాయిలో స్పందన వచ్చింది. 2024 ఎన్నికలలో  కూటమి గెలవడానికి కూడా  చాలా కీలకంగా మారారు. కాని నారా లోకేష్ ని మాత్రం టిడిపి నేతలు, కార్యకర్తలు కాబోయే సీఎంగా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే 2029 ఎన్నికలలో  నైనా నారా లోకేష్ కి ఆ అవకాశం వస్తుందా రాదా అనే విషయం తెలియాలి. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి గానే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: