
ఆస్ట్రేలియాలో స్వామినారాయణ ఆలయం పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి జాత్యహాంకార దుర్భాషపూరిత మైన వ్యాఖ్యలు రాశారు..అక్కడ ఉండే ఒక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆలయానికి సమీపంలో రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం రాశారట. హిందూ కౌన్సిలర్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు(మకరంద్ భగవత్, విక్టోరియా చాప్టర్)స్పందిస్తూ స్వామి నారాయణ ఆలయంలో రోజువారి ప్రార్థనలు, భజనలు ,సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.. కానీ అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎదురవ్వడం చాలా బాధాకరం.. హిందువులు ఇతర వర్గాల వారి పైన ప్రేమను చూపించాలని ద్వేషం చూపించకూడదని ప్రేమే విజయం సాధిస్తుందంటూ భగవత్ వెల్లడించారు.
ఆలయంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలత పెట్టే అంశం అంటూ భగవత్ వెల్లడించారు.. భయాన్ని వ్యాప్తి చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ భగవత్ వెల్లడించారు. అయితే ఇది కేవలం విధ్వంసమే కాదని ఉద్దేశపూర్వకంగానే ఇది ఎవరో చేశారంటూ తెలియజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు విక్టోరియాలో చోటు లేదని తెలిపిన భగవత్.. జరిగిన ఘటన మీద పోలీసులకు కూడా విచారణకు ఆదేశించామంటూ అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. పోలీసులు కూడా విచారణను ప్రారంభించారు. అలాగే ఈ నెల 19న భారత్ విద్యార్థి పైన కొంతమంది దుండగులు దాడి చేశారు. అప్పుడు కూడా ఆ విద్యార్థి పైన పిడుగులు గుద్దుతూ జాతి అహంకార వ్యాఖ్యలు చేశారట.