
గత 2024 ఎన్నికల ముందు బిజెపి పార్టీలోకి చేరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవలేకపోయారు. వైసిపి నేత మిథున్ రెడ్డి పైన ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోవడంతో రాజంపేట వైపు అసలు చూడలేదు కిరణ్ కుమార్ రెడ్డి. సుమారుగా 14 నెలలుగా ఆయన రాజంపేట నియోజకవర్గంలో అడుగే పెట్టలేదంటు అక్కడివారు తెలుపుతున్నారు. ఎక్కువగా ఆయన హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలోనే ఉంటున్నారని సమాచారం.
అయితే తాజాగా వినిపిస్తున్న మేరకు పదేళ్ల విశ్రాంతి రావడంతో ఇక రాజకీయాలు చేయడం కంటే విరామం తీసుకోవడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బిజెపి పార్టీలోకి చేరిన కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభ ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభకు ప్రమోట్ చేస్తారని ఎంతో ఆశతో ఉండేవారు.. తమలాంటి సీనియర్ నేత బిజెపి పార్టీకి ఉపయోగపడుతుందని భావించిన కిరణ్ కుమార్ రెడ్డికి పదవి ఉంటే ప్రజలలో వెళ్లడానికి బాగుంటుందనే విధంగా ఆయన అనుచరులు భావించారు.. కానీ వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి మరి వచ్చిన రాజ్యసభ సభ్యులను కూటమి పార్టీలో చేర్చుకొని మరి వారికే తిరిగి అవకాశం ఇస్తున్నారట. ఈ విషయంపై నిరాశ చెంది కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అడుగు పెట్టలేదని వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే మాజీ సీఎం రాజకీయాలకు దూరమవుతారా లేదా అనేది చూడాలి.