
పార్టీని పెంచే ఉద్దేశంతోనే తమ మాట చెబుతామనుకుంటే.. పైస్థాయిల నుంచి ఆత్మగౌరవం దెబ్బతీసే వ్యాఖ్యలు వస్తున్నాయని వాపోతున్నారు. విశాఖ వేదికపై మైక్ కట్.. అసంతృప్తికి అద్దంపట్టిన ఘటన!.. తాజాగా విశాఖలో జరిగిన ఓ సమావేశంలో మహిళా కార్పొరేటర్ తమ వార్డులో ఎలాంటి పనులూ జరగడం లేదని నాగబాబుకు చెప్పేందుకు ముందుకు రాగానే మైక్ కట్ అయిన ఘటన చర్చనీయాంశమైంది. ఆమె భర్త కూడా ఇదే విషయాన్ని వివరించేందుకు ట్రై చేయగా.. టీడీపీని టార్గెట్ చేస్తున్నారన్న అనుమానంతో నాగబాబు తీవ్రంగా రెస్పాండ్ అయ్యారట. "ఉండాలంటే పార్టీలో ఉండండి.. లేనిది తేల్చుకోండి" అన్నట్లుగా ఆయన స్పందించారని వార్తలు వస్తున్నాయి. అసలైన అధికారం ఎవరిచేత్లో ఉంది..? .. ఎంపికైన జనసేన ఎమ్మెల్యేలు కొందరు సైతం తమ నియోజకవర్గాల్లో అధికారాన్ని పూర్తిగా టీడీపీ నేతలే వినియోగిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
తామే ఎమ్మెల్యేలు అయినా.. అధికారులతో మాట్లాడటానికి టీడీపీ నేతలే మద్దతు కావాలంటే ఎలా? అని మధనపడుతున్నారు. పైగా తాము ఎదురుదాడికి దిగితే.. వైసీపీ వాళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ ముద్ర వేయడం జరుగుతోందట. ఒక్కటే మాట – మాట చెప్పే వేదిక కావాలి! .. పార్టీలో సమస్యలు ఉంటే వాటిని చెప్పుకునే వేదిక కావాలని, చెప్పినవాటిపై సమగ్ర దృష్టి ఉండాలని క్యాడర్ కోరుతోంది. లేకపోతే కార్యకర్తల నమ్మకం పోతుందని .. ఇక ఇలాగే సాగితే పార్టీ శ్రేయస్సు కోసం తాము చేసే పోరాటమే విసుగుదేలిపోతుందని అంటున్నారు. కూటమి పాలనలో భాగమై ఉన్న జనసేన .. తన శక్తిని, గౌరవాన్ని నిజంగా ఉపయోగించుకుంటుందా ? లేక ఇంకెన్ని మైక్ కట్లు చూడాలా ? అన్నది సమయం చెప్పాల్సిన విషయం !