వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్ పెట్టినా దానిపై అధికార పార్టీ ఏదో ఒక విమర్శ చేసి ఇబ్బందులకు గురిచేస్తోంది. మీటింగులు సక్రమంగా జరిగినా అక్రమాలకు పాల్పడ్డారని ఆ మీటింగ్ లో గొడవలు జరిగాయని, ఏదో ఒకటి సృష్టిస్తోంది. ప్రభుత్వం తానా అంటే కొన్ని మీడియా సంస్థలు తందానా అంటున్నాయి..ప్రభుత్వం అసలు విమర్శించినా, విమర్శించకపోయినా మీడియా సంస్థలు జరిగిందొకటైతే, చెప్పేది మరోలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా వైసిపికి సంబంధించి  పూర్తిస్థాయిలో అణచివేత ధోరణి కనిపిస్తోందని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో న్యాయం అనేది కనిపించదని అన్యాయానికే అందరూ వత్తాసు పలుకుతారని  తెలియజేస్తున్నారు.. దీనికి ప్రధాన నిదర్శనం వైసిపి లీగల్ సెల్ ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగే.. అక్కడ ఏం జరిగింది అసలు మీడియా ఏం ప్రచారం చేసింది అనే దానిపై లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారా.. మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దామా..

 వైయస్సార్సీపి లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటే అందులో విపరీతమైనటువంటి గొడవలు జరిగాయని ఒక వార్త  కొన్ని చానల్ లలో టెలికాస్ట్ అయింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని వైయస్ఆర్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తాజాగా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. మా మీటింగ్ పూర్తిగా విజయవంతం అయిందని, చిన్న గొడవ కూడా జరగలేదని అన్నారు. జగన్ ప్రసంగానికి న్యాయవాదులంతా ఆకర్షితులై సంఘీభావం ప్రకటించారని తెలియజేశారు. దీన్ని ఓర్చుకోలేనటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మా సమావేశంపై ఒక ఛానల్ చేసిన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ విధంగా మీడియాస్పూర్తిని ఆ ఛానల్ దిగజారుస్తోందని, అక్కడ జరగనిది జరిగినట్టు చూపించి మీడియా రంగానికి మచ్చ తెచ్చేలా బిహేవ్ చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి విషయాలను మేము సహించమని ఆ ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకెళ్తామని అన్నారు. మేము లోలోపల ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశాన్ని తప్పుదారి పట్టించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసే అరాచకాలను ఎదిరిస్తూ చట్టాలు న్యాయాల ద్వారా కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతామని అందరం ప్రతిజ్ఞ చేశామన్నారు. ఎంతో అద్భుతంగా సాగిన ఈ మీటింగ్ పై అసత్య ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: