ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తూ ఉండే సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం భారతదేశంలోని అన్ని భాషల సినీ ప్రముఖులకు తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి. సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానాలు అందిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిసి సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గురించి వివరించారు సురేష్ కొండేటి. మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయి, సంతోషం అవార్డ్స్ ఆహ్వాన పత్రికను అందజేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ అండగా ఉండే సీఎం చంద్రబాబు ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు నిర్వహించడం చిత్ర పరిశ్రమలోని టాలెంట్‌కు ప్రోత్సాహకమని చెబుతూ సురేష్ కొండేటిని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.


సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి మ్యూజిక్ పాట్నర్ గా ఆదిత్య న్యూజిక్ వ్యవహరిసున్నారు. ఈ కార్యక్రమానికి సూర్య సిమ్,  విజయ వారహి మూవీస్ సంస్థ మరియు వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా వెన్ లాక్ గ్రూప్ సంస్థ వ్యవహస్తున్నారు. అలాగే ఈ సారి అవార్డ్స్ కార్యక్రమంగా ఆకాశాన్నంటేలా ఉంటుందని, టాలీవుడ్‌తో పాటు మిగతా అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి సహకారం లభిస్తోందని సురేష్ కొండేటి వెల్లడించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: