ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చేస్తున్న పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్య మరింత పెద్దదని చెప్పవచ్చు. ముఖ్యంగా కూటమి గ్రాఫ్ పరంగా ఇప్పటివరకు అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచామంటూ సీఎం చంద్రబాబు తెలుపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్యోగాల విషయంలోను ఉద్యోగ వర్గాల నుంచి పెద్ద సెగ మొదలవుతోంది. మూడు కీలకమైన డిమాండ్ల పైన ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా వినిపిస్తున్నాయి. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ అంశం పైన కూడా వైసిపి పార్టీ ప్లాన్ ప్రకారమే అడుగులు వేస్తోంది. ఇవన్నీ కూడా పరిణామాలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సెగ తగలడం ఖాయం అనే విధంగా వినిపిస్తోంది.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో వారి యొక్క డిమాండ్లను వినిపించబోతున్నారు.

1).మూడు డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని. ఇందులో కనీసం 2 అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.. దీంతో రూ .30 వేల కోట్ల వరకు భారం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


2). వైసిపి పార్టీ హయాంలో 12 పిఆర్సి వేసినప్పటికీ.. అయితే అప్పుడు నిర్మించిన చైర్మన్ ని వద్దని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సమయంలో ఎన్నికలు రాగా పట్టించుకోలేదు..ఇప్పుడు మరొకసారి ఉద్యోగులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే 12వ పిఆర్సిని అమలు చేయాలని కోరుతున్నారు. ఒకవేళ ఇది అమలు అయితే సర్కారు పైన మరింత భారం పడే అవకాశం ఉంటుంది.


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకరణం చేయడానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అందులో పనిచేసే ఉద్యోగులతో పాటు వైసిపి కార్యకర్తలు నేతలు కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఇటీవలే 32 విభాగాలను ప్రైవేటుకు అప్పగించిన యాజమాన్యం నోటిఫికేషన్ కూడా జారీ చేసిందట. దీనిని వ్యతిరేకిస్తే చాలామంది ఉద్యోగులు, కార్మికులు ఉద్యమిస్తున్నారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం టీచర్ పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. వీటికి తోడు నిరుద్యోగ భృతి రూ.3000 ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, అలాగే మహిళలకు ప్రతినెల ఇస్తానన్న రూ.1500 రూపాయలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే విధంగా వైసీపీ నేతలు , కార్యకర్తలు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: