కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటల వెనుక అంతరార్థం ఏంటి అనేది ఎంతకూ అంతు పట్టదు.. రాజకీయంగా మాట్లాడుతూనే డబల్ మీనింగ్ డైలాగులు కొడుతూ ఎవరికి అర్థం కాని రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఇలాగే ఉన్నాయి అంటున్నారు చాలామంది ఈయన మాటలు విన్న జనాలు. మరి ఇంతకీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి.. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైయస్సార్ స్మారక పురస్కారం 2025  ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు.ఈ నేపథ్యంలోనే దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కెవిపి మధ్య ఉండే స్నేహం,అనుబంధం ఎలాంటిదో చెప్పుకొచ్చారు.

 ఈ కార్యక్రమం లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కెవిపి లాంటి స్నేహితులు ఉండాలని చాలామంది ప్రయత్నిస్తారు.కానీ ఆయన లాగా ఉండడం ఎవరి తరం కాదు. వైయస్సార్ ఎదుగుదలకి కెవిపి ఎంతగానో కృషి చేశారు.ముఖ్యంగా ఇప్పటి జనరేషన్లో కేవీపీ లాంటి వాళ్లు కనిపించడం లేదు. కానీ కొంతమంది మాత్రం మేము కూడా వైఎస్ఆర్-కేవిపి లాగే అని చెప్పుకుంటారు. కానీ ఆ తరానికి వైఎస్ఆర్ కేవిపి లాంటివారు ఇద్దరు తప్ప ఎవరు లేరు. కేవిపి లాగా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలి.కానీ అలా త్యాగం చేసే వాళ్ళు ఇప్పట్లో లేరు ఉండరు. కేవీపీ గారు వైయస్సార్ కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశారు. కానీ ఇప్పటి జనరేషన్ లో అయితే మొదటి వారంలో మనం లోపలికి రమ్మని ఆహ్వానిస్తాం. వచ్చిన వారంలో కుర్చీలో నుండి కాస్త పక్కకు జరిగితే చాలు వచ్చి కుర్చీలో కూర్చొని పాలిస్తామంటారు.

అలాంటి వారు ఉన్నారు ఇప్పటి జనరేషన్లో అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదంటున్నారు అనే అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డి మాటల వెనుక అర్థం వేరే ఉందని,కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చాలా మంది ఆయన్ని పడగొట్టి ఆయన కుర్చీలో కూర్చోవాలని చూశారంటూ ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. అంతేకాదు డిసెంబర్లో కల్లా సీఎం మార్పు ఉంటుంది అంటూ ఎన్నో రూమర్లు మీడియాలో వినిపిస్తున్న వేళ వాళ్లను టార్గెట్ చేసే రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: