
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించడం ద్వారానే సరుకు రవాణాలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుంది అంటూ తెలియజేశారు. భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ టాటిస్టిక్స్ వంటివి పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయి మరికొన్ని కూడా నిర్మాణ దశలో ఉన్నాయని. 2047 నాటికి తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు.
గత వైసిపి హయాంలో డెవలప్మెంట్ కి, పరిశ్రమలకు సంబంధించిన వాటి విషయంలో జగన్ చెప్పుకోలేకపోయారు.. అయితే ఇటీవలే సీఎం చంద్రబాబు చెప్పిన 50 కిలోమీటర్లకు ఒక పోర్టు అనే ప్లాన్ వాస్తవంగా మాజీ సీఎం జగన్ తీసుకువచ్చారు. అంతేకాకుండా వీటిని ఆచరణలోకి కూడా తీసుకోవచ్చారు. అయితే ఇదే ప్లాన్ ను సీఎం చంద్రబాబు కూడా ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పుకున్నప్పటికీ జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు. కేవలం ఎక్కువగా బటన్ నొక్కడం సంక్షేమం గురించి మాత్రమే చెప్పిన జగన్.. అదే జగన్ కు మైనస్ గా మారింది.
అయితే అప్పుడు చెప్పుకోలేకపోయినా ఇప్పుడు తాజాగా వైసీపీ పార్టీ హయాంలో కొప్పర్తిలో ఈఎంసి ఏర్పాటు చేశాం 2022,23 లో ఈఎంసీ కి వచ్చిన టెక్నోడోమ్ టెక్సానా సంస్థలతో వెంటనే పనులు మొదలుపెట్టాము. శరవేగంగా పనులు చేయించగలిగాము అదే ఇప్పుడు ఉత్పత్తితో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వాటికి సంబంధించి జగన్ ఒక పోస్ట్ చేస్తూ టెక్నోడోమ్ టెక్సానా సంస్థలపై ప్రశంసలు కురిపించారు. ఈ రెండు సంస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలి అంటూ కూడా ప్రశంసించారు. ఇలా వాటికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్లే 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.