
గత ఎన్నికలకు ముందు ఇక్కడ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాదరావు, కొడుకు శివరాం రూరల్ మండలంలోని నేతలు ఇలా ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తున్నారు. అయితే సీటు దక్కించుకున్న కన్నా లక్ష్మీనారాయణ అంబటి రాంబాబు మీద ఘన విజయం సాధించారు. కన్నా నియోజకవర్గానికి కొత్త అయిన సత్తెనపల్లి గ్రూప్స్ గురించి కన్నాకు పూర్తి క్లారిటీ ఉంది. పైగా అన్ని గ్రూపులు ఒకే సామాజిక వర్గానికి చెందినవే. నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యమే ఉంటుంది. దీంతో ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు వ్యతిరేకమవుతారని భావించిన కన్నా లక్ష్మీనారాయణ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
తాను ఎక్కువగా బాధ్యత తీసుకోకుండా అదే సామాజిక వర్గానికి చెందిన దరువురి నాగేశ్వరరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించేశారు. అయితే పాత సీనియర్ నేతలు తమను కాదని.. కొత్తగా దరువూరికి బాధ్యతలు ఇవ్వడం ఏంటని అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఏదేమైనా కొండ నాలుకకు మందేస్తే .. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ పరిస్థితి తయారైందనే టాక్ నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది.