
దీనికితోడు ఇటీవల విజయవాడలో జరిగిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమంలో చంద్రబాబు – పవన్ కలసి వేదిక పంచుకోవడం… జనసేన చీఫ్ స్వయంగా బాబును పొగడడం… అన్నీ సర్దుకునే దిశలో సానుకూల సంకేతాలుగా మారాయి. అగ్రనేతలు సర్దుకుపోతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. బాలకృష్ణను సమర్థించే టీడీపీ నాయకులు ఒకవైపు… ఆయన కామెంట్స్ చిరంజీవిని అవమానించాయని చెప్పే జనసేన కార్యకర్తలు మరోవైపు విభజన స్పష్టంగా కన్పిస్తోంది. సోషల్ మీడియాలో ఇద్దరి వర్గాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. నియోజకవర్గ స్థాయిలో చిన్న చిన్న విభేదాలు పాతుకుపోతున్నాయని పార్టీ వర్గాల టాక్.అగ్రనేతలు ఒకదిశగా కలిసిపోయినా, క్షేత్రస్థాయిలో విభేదాలు కొనసాగితే దెబ్బతినేది చిన్న నాయకులకే తప్ప పార్టీకి కాదు.
పార్టీ టికెట్ పంపిణీ సమయానికి ఈ రకమైన విభేదాలు చురకలుగా మారి చాలామందిని పక్కన పెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన తన బలం పెంచుకోవాలని, టీడీపీ ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేయాలని చూస్తున్న వేళ… క్షేత్రస్థాయిలో ఈ రకమైన అంతర్గత పోట్లు పార్టీ స్ట్రాటజీని దెబ్బతీయవచ్చు. అందుకే అగ్ర నాయకులు ఇచ్చే మెసేజ్‌ను క్షేత్రస్థాయిలోని నాయకులు సీరియస్‌గా తీసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి. పైస్థాయిలో చంద్రబాబు–పవన్‌ల కలివిడి పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నా, లోకల్ స్థాయిలో విభేదాలు నియంత్రణలోకి రాకపోతే అనేక మంది చిన్న నాయకులకు రాజకీయ భవిష్యత్తు గండిపడే అవకాశం ఉంది. కూటమి గెలుపు టార్గెట్ చేస్తే అంతర్గత ఏకత్వం తప్పనిసరి.