అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాదు నుంచి వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ ప్రాంతంలోని ఉలిందకొండ సమీపంలో రాగానే వెనుక నుంచి వస్తున్న ఒక ద్విచక్ర వాహనం బస్సును ఢీకొనింది. ఆ ద్విచక్ర వాహనం బస్సు కిందికి వెళ్లి కింద ఉన్న ఇంధన ట్యాంకును ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి. దీంతో బస్సు అంతా కూడా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో కొంతమంది ప్రయాణికులు తేరుకొని బయటపడగా మరి కొంతమంది మంటలలో చిక్కుకుపోయారు.
పోలీసులకు వెంటనే సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయిందని ప్రయాణికుల్లో ఎక్కువమంది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నట్టుగా తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు కూడా పరారయ్యారని సమాచారం. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారి విషయానికి వస్తే..(రామిరెడ్డి, సత్యనారాయణ, నవీన్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీలక్ష్మి, అఖిల్, అకిర, జస్మిత, రమేష్, సుబ్రహ్మణ, జయసూర్య) బయటపడ్డారు. అయితే ఇంకా మరణించిన వారి వివరాలను అధికారులు తెలియజేయడం లేదు. మరి ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి