- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . . .

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజకీయంగా కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయన తిరిగి వైసీపీలో చేరతారు అంటున్నారు. 2024 సాధారణ ఎన్నికలలో భీమిలి నుంచి పోటీ చేసిన ఆయన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓట‌మి పాలయ్యారు. అదే ఏడాది డిసెంబర్ వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత టిడిపి - జనసేన లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి కార్పొరేటర్ గా తన కుమార్తె చేత వైసిపి మేయర్ కి వ్యతిరేకంగా ఓటు వేయించారు. వైసీపీ మేయర్ గద్దె నుంచి దిగటానికి కారణమయ్యారు. అయినా సరే అవంతి విషయంలో కూటమి పార్టీలు కరగలేదని అంటున్నారు. ఆయనను టిడిపిలో చేర్చుకోడానికి గంటా శ్రీనివాసరావు అడ్డు పుల్ల‌లు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదని అంటున్నారు.


ఈ క్రమంలో అవంతి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తిరిగి వైసిపిలో చేరటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అవంతి తన మనసులోని మాటను వైసిపి పెద్దల చెవి లో వేశారని ... అయితే ఆయన ను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో పార్టీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల లో భీమిలి నుంచి పోటీ చేయడానికి అవంతి వైసీపీ యే సరైన ఆప్షన్ అని ఇప్పటికే డిసైడ్ అయిపోయారట. అయితే వైసీపీలో కూడా ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకోవడంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు.


పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి కింద పడేసారని . . . ఇప్పుడు పార్టీ పుంజుకుంటున్న వాళ్ళ తిరిగి చేర‌తాను అంటున్న అవంతి విష‌యం లో అధిష్టానం ఆలోచించాలని నాయకులు కోరుతున్నారు. అవంతి ప్రజారాజ్యం నుంచి భీమిలి ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత టిడిపిలోకి వచ్చి ఎంపీ అయ్యారు. అనంతరం వైసిపి లోకి వెళ్లి మంత్రి అయ్యారు. ఇలా పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా ఆయన తన రాజకీయ అవసరానికి ప్రతిసారి పార్టీలు మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: