తెలంగాణ‌కు చెందిన మాజీ మంత్రి .. ఒక‌ప్ప‌టి తెలుగుదేశం నేత ... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని, చంద్రబాబుతో ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన భార్య మాజీ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ నుంచి మ‌ల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వారు రాజ‌కీయంగా పెద్ద‌గా యాక్టివ్ గా క‌న‌ప‌డ‌డం లేదు. ఇప్పుడు ఉన్న‌ట్టు ఉండి చంద్ర‌బాబు ను పొగుడుతూ ఈ ట్వీట్ పెట్ట‌డం ఎందుకు ? అన్న చ‌ర్చ స్టార్ట్ అయ్యింది.


ఇక మ‌హేంద‌ర్ రెడ్డి విష‌యానికి వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు గా ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. ఆయ‌న చాలా యేళ్లుగా రాజకీయాలను రాజకీయాలుగా చేస్తూ పట్టు పెంచుకున్నారు. పార్టీలు మార‌డంలోనూ ఆయ‌న‌ది ప్ర‌త్యేక శైలీ .. ముందు టీడీపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యే .. ఆ త‌ర్వాత బీఆర్ఎస్ లోకి వ‌చ్చి మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ఆ పార్టీ రెండోసారి గెలిచిన‌ప్పుడు ఆయ‌న ఓడిపోయారు. కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చినా మొన్న ఎన్నిక‌ల‌కు ముందు సీటు ఇవ్వ‌లేదు. ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీలో చేరారు. ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.


అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత మ‌హేంద‌ర్ రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ తో అంటీ ముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు. ఎక్క‌డా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్టు ఉండి ... హఠాత్తుగా చంద్రబాబుతో అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. తెలంగాణ లో ఇప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీడీపీలో చేరే అంత సాహ‌సం అయితే చేయ‌రు. కానీ ఆయ‌న ఏదో ఒక రాజ‌కీయ వ్యూహాన్ని అనుస‌రిస్తున్నార‌ని .. అందుకే ఇప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా చంద్ర‌బాబు తో త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నార‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: