జూబ్లీహిల్స్ బై పోల్.. ఈ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది.. తెలంగాణలో ఎన్నిక ఏదైనా సరే తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది. అయితే ఇందులో తెలంగాణ రాష్ట్రమంత ఒకెత్తయితే హైదరాబాద్ నగరంలో మరో ఎత్తు..ప్రస్తుతం నగరంలో బిజెపికి మంచి పట్టు ఉంది.. కానీ తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో ఎక్కువగా పట్టులేకుండా పోయింది.. కానీ ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం బీజేపీ  మంచి విజయాన్ని సాధిస్తూ వస్తోంది. ఏది ఏమైనప్పటికీ జనాలు  కేంద్రంలో బిజెపి ఉండాలి రాష్ట్రంలో ఇతర ఏ పార్టీ ఉన్నా పర్లేదు అనే విధంగా తయారయ్యారు. అలాంటి ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది. ఈ ఎన్నికల రిజల్ట్ ని బట్టి పార్టీల భవిష్యత్తు మారబోతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో  కాంగ్రెస్ గెలిస్తే వారికి మరింత పట్టు పెరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారు. 

అలాగే ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే, ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రజల్లో నమ్మకం పోయిందని ఒక మెసేజ్ ఇస్తారు. ఇక ఈ రెండు పార్టీలను తలదన్నే విధంగా బీజేపీ గెలవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే సాధారణంగా బీజేపీకి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయదు. కాబట్టి ముస్లిం ఓట్లను ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పంచుకుంటే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సెటిలర్లు,  తెలుగుదేశం పార్టీ అభిమానులు కొంతమంది హిందువులు బీజేపీ కి ఓటు వేసే అవకాశం ఉంది. దీనికి తోడు కిషన్ రెడ్డి పార్లమెంటు పరిధి, ఇప్పటికే చాలా డివిజన్లలో బీజేపీ అక్కడ మంచి విజయం సాధించింది. ఈ విధంగా ముస్లిం ఓట్లు చీలిపోతే మిగతా ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

లంకల దీపక్ రెడ్డిని బీజేపీ తరుపున లేట్ గా టికెట్ ప్రకటించినా కానీ లేటెస్ట్ గా ప్రచారం చేస్తున్నారు. అయితే హిందూ ఓట్లు, సెటిలర్ల ఓట్లు బీజేపీకి పడాలనే ఆలోచనతో బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలను కూడా ఇక్కడికి తీసుకువచ్చి ప్రచారం చేయిస్తారట. దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించినటువంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రచారానికి తీసుకువస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన ప్రచారం చేస్తే మాత్రం తప్పకుండా బీజేపీ లో కొత్త జోష్ పెరుగుతుంది. దీనివల్ల వీరికి ఓట్లు పెరిగి గెలిచినా గెలవచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లను తలదన్నే విధంగా ప్లాన్లు వేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: