బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి అంచనాలను మించి మరి సీట్లు రాబట్టింది. ఎప్పటిలాగే బీహార్లో పలు కీలకమైన అంశాలు ఎన్డీఏ కూటమి ప్రజలలోకి తీసుకు వెళ్లడం వల్లే ఇంతటి విజయాన్ని అందుకున్నాయని వినిపిస్తున్నాయి. బీహార్లో ఎన్నో ఏళ్లుగా ఎక్కువ కుల సమీకరణాలు గెలుపు పాచికలుగా ఉండేవి. అయితే ఎన్డీఏ గెలుపుతో వాటిని తొలగించింది. ఈసారి అగ్రకులాలు, ఈ బీసీలు, కొన్ని ప్రాంతాలలో ఓబీసీ ఓటర్లే కీలకంగా మారారట. ముఖ్యంగా వెనకబడిన వర్గాలే లక్ష్యంగా ఎన్డీఏ అమలు చేసిన పథకాలు మంచి పేరు తీసుకువచ్చేలా చేశాయి.


సీఎం నితీష్ కుమార్ కి కూడా బీహార్లో మహిళల దగ్గర మంచి పేరు ఉంది.  అభివృద్ధి, రహదారుల పరిస్థితి, చట్టపరమైన వ్యవస్థను మెరుగుపరచడంతో పాటుగా, గ్రామాల విద్యుద్దీకరణ, మహిళల ప్రాధాన్యత ఇవ్వడం, చదువును ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాలలో అమలు చేసిన పథకాలు వల్లే నితీష్ కుమార్ కి మహిళలు ఓటు వేశారని వినిపిస్తున్నాయి.


అలాగే ప్రధానమంత్రి మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఆదరణ కూడా బీహార్లో ఎన్డీఏ కూటమికి గెలుపుగా మారింది. ఉజ్వల, నివాస పథకం, ఫ్రీ రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల వల్ల అక్కడ పేద కుటుంబాలకు చాలా మేలు జరిగాయి. ఉచిత రేషన్, గ్యాస్ సబ్సిడీ, మహిళలు, వలస కార్మికులు, కూలీలకు తగ్గట్టు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎన్డీఏ కూటమి.

మహాఘాట్ బంధన్ కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అలాగే న్యాయకత్వ గందరగోళం ఏర్పడడం, ముస్లిం, యాదవ, కోయరి, కుర్మీ వంటి ఓట్లు ప్రతిపక్ష పార్టీ నుంచి చీలిపోయాయి.

ఎన్నికలలో ఎన్డీఏ కూటమి నుంచి తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పైన, మౌలిక సదుపాయాలు, రాబోయే రోజుల్లో చేసే పథకాల పైన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం పంచాయతీలలో నితీష్ కుమార్ అమలు చేసిన పని వల్ల, అలాగే మహిళా రిజర్వేషన్స్, అమ్మాయిలకు సైకిల్ ఇవ్వడం అన్ని కులాల మహిళ ఓటర్లను ప్రత్యేకించి ఆకట్టుకున్నాయి.

అలాగే ఉద్యోగాలు విడుదల చేయడం, పోటీ పరీక్షపైన యువత అసంతృప్తితో ఉన్న ఎన్డీఏ న్యాయకత్వం మీద నమ్మకం ఉండడంతో యువత కూడా సానుకూలంగానే ఎన్డీఏ కూటమి వైపు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: