ఏపీలో యాక్షన్ ప్లాన్ రెడీ! .. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల తర్వాత ఏపీ ప్రభుత్వం వెంటనే యాక్షన్ మోడ్‌లోకి దిగింది. వీధి కుక్కల జనాభా అదుపు తప్పకుండా ఉండడం, రేబీస్ ప్రమాదం పెరగడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపింది. ఏపీలో వీధి కుక్కలు సంఖ్య 5.15 లక్షలు అని అంచనా… ఇది షాక్ కొట్టించే నంబర్‌గానే చెప్పాలి. పట్టణాలలోనే ఈ స్థాయిలో కుక్కలు ఉండటంతో ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే 3.61 లక్షల కుక్కలకు శస్త్రచికిత్స ద్వారా సంతాన నిరోధకత కల్పించారు. ఇదొక పెద్ద అడుగే. రేబీస్‌ని పూర్తిగా అరికట్టే దిశగా .. ప్రమాదకరమైన, రేబీస్ సోకిన కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.
పెద్ద నగరాల్లో మొదటగా డాగ్ పౌండ్లు, ఆపరేషన్ థియేటర్లు, కెన్నెల్స్, ఏబీసీ సెంటర్లు ఏర్పాటు జరగుతోంది. మొత్తం 197 మంది శిక్షణ పొందిన డాగ్ క్యాచర్లు ఇప్పటికే నియమించబడటం కూడా ప్రభుత్వం సీరియస్‌నెస్‌కు నిదర్శనం. కొత్త సర్వే – ప్రజల భద్రతే ప్రైయారిటీ .. ఇక వీధి కుక్కలపై కొత్త సర్వే నిర్వహించాలని కూడా మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పిల్లలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు, మహిళలు కుక్క దాడులకు గురికాకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాల వంటి ప్రాంతాలను కుక్కల బెడద లేని జోన్‌లుగా మార్చాలని అధికారులు క్లియర్ ఆదేశాలు పంపారు. మొత్తానికి, సుప్రీంకోర్టు ఆదేశాలు – రాష్ట్ర ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ – మున్సిపాలిటీల కఠిన చర్యలు… ఇవన్నీ కలిస్తే రానున్న రోజుల్లో వీధి కుక్కల బెడదకు పెద్ద ఎత్తున చెక్ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి