గత ఐదు సంవత్సరాల పాటు ఏపీలో సాగిన ఈ లిక్కర్ దందాలో అంతిమంగా ఎవరి జేబులు నిండాయో... రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. పాత్రధారులంతా కొద్ది మొత్తంలో లబ్ధి పొంది ఉండవచ్చు, కానీ వైట్ చేసి వేల కోట్లను స్వీకరించింది ఆ సూత్రధారే! సీఐడీ సిట్ ఎంత వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తే, కేసు అంత బలంగా మారుతుంది. అరెస్టులు చేస్తూ పోయి, సూత్రధారిని పట్టుకోవడంలో ఆలస్యం జరిగితే, ఇంత శ్రమ పడినప్పటికీ కేసు నీరుగారి పోతుందని, ప్రజలు ఆసక్తి కోల్పోతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐదు సంవత్సరాల పాటు మద్యం తాగేవారిని తగ్గిస్తామని చెప్పి, విపరీతంగా రేట్లు పెంచారు.
తీరా చూస్తే, పెంచిన రేట్లకు... మార్కెట్‌లో దొరికే ప్రముఖ బ్రాండ్లను పోలిన స్వయం తయారీ నకిలీ లిక్కర్‌ను అమ్మి వేల కోట్లు వెనకేసుకున్నారు. ఆ సొమ్మంతా బంగారంతో పాటు పెట్టుబడుల రూపంలో సూత్రధారికి చేరింది. ఈ నకిలీ మద్యాన్ని తాగి, అన్యాయంగా వేల కోట్లు చెల్లించిన లక్షలాది మందు బాబుల శాపనార్ధాలు ఫలించాలంటే... ఈ కేసు త్వరగా ఒక కొలిక్కి రావాలి. ఐదు సంవత్సరాల పాటు సాగిన అరాచకాలకు సంబంధించి చాలా కేసులు ఉన్నప్పటికీ, ప్రజలకు నమ్మకం కలిగించాలంటే... ముందు బయటపడిన ఈ లిక్కర్ స్కామ్‌ను క్లైమాక్స్‌కు తీసుకెళ్లాలి. సిట్ ఈ కేసులో వేగం పెంచి, త్వరితగతిన లాజికల్ కంక్లూజన్ తీసుకువస్తేనే... ప్రజలకు న్యాయంపై విశ్వాసం పెరుగుతుంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి