నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున కేకులు కట్ చేస్తూ, సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేదలకు ఆహారం పంచడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో జగన్ పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకుంటున్నారు.ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? రాజకీయంగా ఆయన ఎందుకు ఇంత హైలైట్‌గా మారారు? అనే అంశాలపై అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేకంగా చర్చలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వచ్చిన కొన్ని గొప్ప లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
“పులి కడుపున పులే పుట్టింది” అన్న సామెతను గుర్తు చేస్తూ, వైయస్ కుటుంబ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారని వైసీపీ అభిమానులు ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి ముక్కుపై కోపం ఉన్నా సరే, ముఖాముఖిగా మాట్లాడే స్వభావం ఉండేది. అంతేకాదు, ఒక పనిని చేయాలని ఫిక్స్ అయితే ఎంత కష్టమైనా సరే, ఎంత అడ్డంకులు వచ్చినా సరే, అనుకున్న టైమ్‌కు ఆ పని పూర్తి చేసే దృఢసంకల్పం ఆయనలో స్పష్టంగా కనిపించేది. ఆ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది.
అదే క్వాలిటీ సేమ్ టు సేమ్ వైయస్ జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉందని అభిమానులు చెబుతున్నారు. జగన్ కూడా ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే, అది రాజకీయమైనా, పరిపాలన సంబంధమైనదైనా, వ్యక్తిగతమైనదైనా సరే, కచ్చితంగా చేసి తీరుతారు అని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీల విషయంలో అయినా, తనను ఇబ్బంది పెట్టే శత్రువుల విషయంలో అయినా, తనను టార్గెట్ చేసే వ్యక్తుల విషయంలో అయినా ఒక్కసారి కమిట్ అయితే జగన్ మాట జగన్ వినడు అంటూ సినిమాటిక్ డైలాగ్స్‌తో ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఎక్కడ చూసినా జగన్… జగన్… జగన్ అంటూ జగన్ నామస్మరణే కనిపిస్తోంది. అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని, విశ్వాసాన్ని సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా వ్యక్తపరుస్తూ, ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి