ఐపీఎల్ లో మొదటి సారీ అడుగుపెట్టి మెగా టోర్నీలో ప్రస్థానాన్ని కొనసాగించిన గుజరాత్ టైటాన్స్  ఇక మొదట ఈ సీజన్లోనే అదరగొట్టింది. మొదటి నుంచి వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోయింది. ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. ఒకవైపు దిగ్గజ ఆటగాళ్లు ఒత్తిడికి చిత్తు అవుతూ ఉంటే అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం ప్రత్యర్థి జట్ల పాలిట సింహస్వప్నం గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు గత రెండేళ్లుగా పేలవమైన  ఫామ్ కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఫాంలో కొనసాగుతు కెప్టెన్గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు.


 ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ సాధిస్తున్న విజయాలు చూస్తే హార్దిక్ పాండ్యా పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు ఆటగాళ్లు. కాగా ఇటీవలే ప్లే ఆఫ్ లో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. ఈ క్రమంలోనే  ఇక ఫైనల్ కు చేరడం పై అటు కెప్టెన్ హార్థిక్ పాండ్య ఆనందం లో మునిగిపోయాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్ల కాలంలో సంయమనం పాటించడం నేర్చుకున్నాను. నన్ను నేను మరింతగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. ఇక ఇందులో  ముఖ్యంగా నా కొడుకు నా భార్య మా నాన్న ఎంతో కీలకపాత్ర పోషించారు అంటూ చెప్పుకొచ్చాడు హార్థిక్ పాండ్యా.


 మెరుగైన క్రికెటర్గా ఎదిగేందుకు ఎంతగానో తోడ్పాటు అందించా అంటూ చెప్పుకొచ్చాడు. నమ్మకం ఉంచి కెప్టెన్గా బాధ్యతలు అప్పగించిన గుజరాత్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఇక జట్టులో ఉన్న 23మంది ఆటగాళ్లు వేరువేరు వ్యక్తిత్వాలు కలిగినవారు. చుట్టూ పాజిటివీటి ఉంటేనే అంతా బాగుంటుంది. మన విజయానికి కారణం కూడా అదే ఇంట్లో కూర్చుని ఆటగాళ్లు తమ వంతు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు.  ఇక్కడిదాకా రాగలిగామూ అంటే దానికి సమిష్టి కృషి కారణం అంటు హార్థిక్ పాండ్య తెలిపాడు. ఇక ఈ విజయంతో ఉప్పొంగి పోను నేలమీదే ఉండేందుకు ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: