భవిష్యత్తుపై భయాందోళనలో ఉన్న చినబాబు పార్టీ నేతలు తనను సరిగా పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారు . చంద్రబాబు రాజకీయ వారసుడు కాబట్టి తనకు అందరు గౌరవ మర్యాదలు ఇస్తున్నారని, లేకపోతే తనను ఎప్పు డో పక్కన పెట్టేసి ఉండేవారనే విషయం చంద్రబాబు కు బాగా తెలుసు. పైగా వారసత్వ రాజకీయాలను నమ్ముకుని, ప్రజాబలం లేకుండా అధికారం చెలాయించాలి అని ప్రయత్నిస్తున్నాడనే అపవాదును మూటగట్టుకున్నారు. ఎక్కడికెళ్లినా ఎవరు విమర్శించిన పదే పదే ఈ అంశాన్ని పట్టుకుని పరువు తీసేస్తూ, ఉండడంతో, ఏదో రకంగా ప్రజాబలం ఉన్న వ్యక్తిగా ముద్ర వేసుకునేందుకు చినబాబు గట్టిగానే కష్టపడుతున్నారు .



తనకు అలవాటు లేకపోయినా జిల్లాలో పర్యటిస్తూ జనాలో తిరుగుతూ పార్టీ నాయకులను పరామర్శిస్తూ, ఏదో రకంగా లోకేష్ మహా నాయకుడు అని అనిపించెండుక చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు చంద్రబాబు అండదండలు ఉండడంతో, ఏదో రకంగా రాజకీయం నడిపించవచ్చు అని ఆయన చూస్తున్నా, ఆ తరువాత పరిస్థితి ఏమిటనే బెంగ అప్పుడే మొదలై పోయినట్టుగా కనిపిస్తోంది. అందుకే తెగ హైరానా పడిపోతూ, ప్రజాబలంతో  గెలిచి ఆ వైసిపి నాయకులకు సవాల్ విసరాలి అని, అనుకోని పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారం చేపడితే సీఎం కుర్చీ ఎక్కాలి అనేది చంద్రబాబు తాపత్రయం గా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు నియోజకవర్గాల బాట పట్టి ,  ఎక్కడి నుంచి పోటీ చేస్తే కలిసి వస్తుంది అనే విషయం పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.




 సరిగ్గా ఇదే సమయంలో తన మామ సులువుగా గెలిపిస్తూ వస్తున్న హిందూపురం పై పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే అక్కడి నుంచి పోటీ చేసి, గెలిచి, తన అంతటి బాహుబలి లేరు అని నిరూపించుకోవాలని తహతహలాడిపోతున్నట్టు గా కనిపిస్తున్నారు. అంతేనా ఒక నియోజకవర్గం అయితే మళ్ళీ పప్పులో కాలు వేసినట్టే అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ, ఈ సారి ఏకంగా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న మరో నియోజకవర్గంలో గెలిచి చూపించి, సింహాసనం ఎక్కాలని బాబు చాలా కంగారుగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు లేదా ఇప్పుడు బాలయ్య నియోజకవర్గంపై చినబాబు కన్ను వేసినట్టుగా కనిపిస్తుండడంతో, దబిడి దిబిడే అనుకుంటూ బాలయ్య తెగ హైరానా పడిపో తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: