పరస్పరం తిట్టుకోవడం, పరస్పరం మోతాదుకు మించి పొగుడుకోవడం అన్నవి రెండు ప్యానెళ్లూ చేస్తున్న పని. పెన్షన్లు ఇచ్చామని నరేశ్ అంటే, అది ఇవ్వడం గొప్ప పనేం కాదు.. అది వారి హక్కు అని అంటున్నాడు ప్రకాశ్ రాజ్ ..ఇంకా ఇంకొన్ని విషయాలపై ఇరు వర్గాలు చాలా బాగా తిట్టుకుని, మీడియాల ఎదుట నవ్వులు నవ్వుకుని వెళ్లిపోయాయి. ఇప్పుడు మా ఎన్నికల్లో గెలుపు ఎవ్వరిదయినా ట్రోల్ చేస్తున్న వారికి మాత్రం ఈ తిట్లు పండుగలానే ఉన్నాయి. నిన్నటి నుంచి ప్రకాశ్ రాజ్ కన్నా మంచు విష్ణునే ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు. అంతేకాదు ఆయన తెలుగు పదాలు పలికిన విధంపై కూడా కొన్ని కామిక్ పోస్టర్లు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఇవన్నీ విష్ణు బాబు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ప్రకాశ్ రాజ్ పై కూడా చాలా విమర్శలు ఉన్నా ఆయన వ్యాఖ్యలు పెద్దగా ట్రోల్ కావడం లేదు. ముఖ్యంగా నరేశ్ , విష్ణును నిన్నటి వేళ మీడియా మైకుల ఎదుట కంట్రోల్ చేసిన సందర్భంలో చెప్పిన మాటలను ఆఫ్ ఊరుకో బాబు ఊరుకో అంటూ గతంలో వచ్చిన డైలాగులను కలిపి వీడియోలు వదులుతున్నారు. ఇవన్నీ భలే నవ్వు తెప్పిస్తున్నాయి. ఫైర్ విల్ బి ఫైర్ అన్న డైలాగ్ కూడా ఈ సారి ట్రోల్ అవుతుంది. పోనీలే నటులు సినిమాల్లో నవ్వించలేకపోయినా, నటన పూర్తి స్థాయిలో పలికించలేకపోయినా ఎన్నికల్లో మాత్రం జీవించేశారు.




ఇండస్ట్రీలో అంతా బాబుల కల్చర్ ఒకటి ఉంది. ఎప్పటి నుంచో ఉంది. బాబుల కల్చర్ నుంచి బాబాయ్ ల కల్చర్ దాకా ఎన్నో మార్పులూ, చేర్పులూ ఉన్నాయి. మా ఎన్నికల పుణ్యామాని బాబుల కల్చర్ బాగా హైలెట్ అవుతుంది. తాజాగా విష్ణు బాబు ను నరేశ్ ఓదార్చారు. దీనిపైనే సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతంలో వచ్చిన శీను వైట్ల సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పిన డైలాగులను వాయిస్ ఓవర్ లో ఉంచి, నిన్నటి విష్ణు ప్రెస్ మీట్ ను వెబ్ కాస్ట్ చేస్తున్నారు పలువురు ఔత్సాహిక వీడియో ఎడిటర్లు. ఇవన్నీ భలే నవ్వు తెప్పిస్తున్నాయి. అదేవిధంగా మా నాన్న  పేరు వాడుకుని ఉంటే నేను సూపర్ స్టార్ అయ్యేవాణ్ని అని విష్ణు చెప్పిన ఓ డైలాగ్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ మా ఎన్నికల వేళ పలు వినోదాలకు కారణం అవుతున్నాయి.


వాస్తవానికి విష్ణుకు ఉన్న సినిమాలు, ఆయన మార్కెట్ అన్నది చిన్నదే. దీనిని ఎవ్వరూ తప్పు పట్టకూడదు. కించపరచకూడదు కానీ కొన్ని మాటలు చెప్పేటప్పుడు వాటికి వాస్తవిత అన్నది ఉందో లేదో వెతుక్కోవాలి. రియాల్టీ చెక్ లేకుండా మాట్లాడడం అన్నది తప్పు. విష్ణు తో సహా ఆయన ప్యానెల్ మా ఎన్నికల్లో  గెలిచినా, గెలవకపోయినా సరే! నటీనటులు పరస్పర శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. దీని వల్ల నష్టపోయేది ఇరు వర్గాలు కూడా! ఇప్పుడు ప్రకాశ్ రాజ్ అయినా, విష్ణు అయినా ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శ రేపటి వేళ మరికొన్ని స్పర్థలకు కారణం అవుతుంది. అలా కాకుండా మేం అంతా ఒక్కటే ఎన్నికలు కనుక తిట్టుకున్నాం అని ఓ సారి హేమ చెప్పిన విధంగా ఎవ్వరైనా చెబితే అంతకుమించిన కామెడీ మరొకటి ఉండదు. ఉంటుందని అనుకోకూడదు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి:

maa