
చంద్రబాబు లాయర్లు వెంటనే కస్టడీ బెయిల్ దాఖలు చేస్తే ఏం జరిగేదో… కానీ వీళ్లు కస్టడీ ఆపించారు. దీనివల్ల ఆయన కొన్ని రోజుల పాటు జైలు లోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ ఆరంభంలో వేయలేదు. కేసు విచారణలో ఉండగా పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల పోలీసు కస్టడీ తర్వాత చంద్రబాబుని జడ్జి ముందు వర్చువల్ గా ప్రవేశపెట్టారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా.. అని ఈ సందర్భంగా జడ్జి అడిగారు. ఏమీ లేదని ఆయన బదులిచ్చారు. ఈ సమయంలో లాయర్లు జోక్యం చేసుకొని ఇలా కస్టడీకి ఇవ్వడమే తప్పు వాదించారు. ఈ విషయంపైనే గతంలో హైకోర్టుకు వెళ్లినా వాళ్లు పక్కన పెట్టారు. మళ్లీ దీనిపై చర్చకు తెరలేపారు. దీని వల్ల జ్యూడిషియల్ కు విసుగు తెప్పించినట్లు అవుతుంది. దీని వల్ల వచ్చే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.