విజయదశమి వేడుకలు ప్రతి సంవత్సరం.... ప్రతి హిందువు జరుపుకునే ఒక మహా పండుగ. కానీ దసరా పండుగ యొక్క ప్రాముఖ్యత అలాగే పండుగనాడు ఆచరించవలసిన కొన్ని నియమాల గురించి అందరికీ తెలియవు... అవేంటో ఒకసారి మన ఏపీహెరాల్డ్ అందించే ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము. హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి.   ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో జరుపుకొని పదవ రోజు విజయ దశమిని ఒక వేడుకలా జరుపుకోవడాన్ని  దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి,తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి, తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ నవరాత్రుల సందర్భంగా ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేసి ఆరాధిస్తారు. అలా విజయదశమి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి భక్తులకు కనువిందు చేస్తారు.... దీని వెనక అనగా ప్రతి రూపం వెనుక ఒక్కో కథ ఉన్నది.

నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు'. నవ రాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకం లో అపమృత్యు దోషం ఉన్న వారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా తొమ్మిది పర్వ దినాలు ఎంత భక్తిగా అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం పొందగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: