గురువారం సాయిబాబా భక్తులు ఆ బాబాకి ప్రత్యేక పూజలు జరిపి కొందరు సాయంత్రం వరకు..మరికొందరు పూజ ముగించే వరకు ఉపవాసం ఉంటుంటారు. ఉపవాసం ఉండే సమయంలో కొందరు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. కానీ వాస్తవానికి ఉపవాసం ఉండండి అంటే పూర్తిగా ఏమి తినకుండా ఉండటం కాదు. ఆ దేవుడి నామం జపిస్తూ ఏకాగ్రతతో ఆయన పూజ అయ్యేంత వరకు నిగ్రహంగా ఉంటూ ఆ బాబా పై మనసు లగ్నం చేయడం. ఉపవాస ప్రక్రియ వల్ల ప్రజలకు ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలను చేకూరుస్తుంది. గురువారం నాడు ఉపవాసం ఉండేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి.

ఉప్పు ఉన్న భోజనాన్ని స్వీకరించరాదు. అదేవిధంగా ఉపవాసం ముగించే సమయంలో ఆ సాయి నాధుని  కథ వినడం లేదా చదవడం వంటివి చేయాలి, ఎవరినీ దూషించకూడదు. ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. అంతేకాక  వైకుంఠం, శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో గురు, శుక్రవారాలు ఎంతో  ప్రత్యేకం. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి, సజ్జనులుగా జీవిస్తారనే నమ్మకం  ఉంది. గురువారం రోజున ధవళ వస్త్రాలతో, నేత్ర దర్శనమిచ్చే వెంకన్న స్వామిని దర్శించుకునే వారికి మనోధైర్యం, భోగభాగ్యాలు, సిరిసంపదలు మన ఇంటికి తరలి వస్తాయని ఒక నమ్మకం.

పుణ్యం కొద్ది పురుషుడు... దానం కొద్ది బిడ్డలు అనే సామెత అందరం వినే ఉంటారు. ఎప్పుడైతే ఆ దేవుడి పై మనస్సును  పూర్తి గా లగ్నం చేసి..ప్రశాంత వాతావరణంలో పూజ చేస్తామో ఆ దేవుడు మనం కోరుకున్న కోరికలను తీరుస్తాడు. గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండే వారికి  ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నేడు   సాయిబాబాకు గాని పాలతో అభిషేకం చేయాలి. పాల పదార్థాలు నివేదించాలి. అందరికీ పంచిపెట్టాలి. పసుపు రంగు వస్త్రాలను కూడా దానంగా ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: