అమ్మవారు చెడును వధించి మంచిని గెలిపించిన రోజున దసరాగా సంబరాలు జరుపుకుంటున్నాము. దసరా పండుగను మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో అలంకరించి రకరకాల నైవేద్యాలతో ఎంతో ప్రత్యేకంగా పూజిస్తాం. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో నిష్టగా పూజిస్తాము. కొందరు వ్రతాలు కూడా చేస్తుంటారు. అయితే ఈ పర్వదినాలలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే మన పూజలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మంచి ఫలితాలు అందుతాయి. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.

ముందుగా ఏవైతే నవరాత్రుల సమయంలో అస్సలు చేయకూడదని చెబుతున్నారంటే...

* ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మాంసాహారాన్ని అస్సలు తినరాదు. అలాగే మన కుటుంబ సభ్యుల కోసం కూడా ఇంట్లో చేయరాదు. ముఖ్యంగా వ్రతం ఆచరించే వారు...వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడరాదు.

* నవ రాత్రుల సందర్భంగా ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తే..ఇక తొమ్మిదవ రోజు పూజ పూర్తయ్యే వరకు ఆ ఇంటికి గొళ్ళెం పెట్టరాదు. అనగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా ఇంటిని వదిలి వెళ్ళరాదు.

* ఈ తొమ్మిది రోజులలో జుట్టు కత్తిరించరాదు.

* అమ్మవారి కోసం తయారుచేసే నైవేద్యాలలో పంచదారను వాడరాదు. అందుకు బదులుగా బెల్లం వాడాలి.

* ఈ నవరాత్రులలో కనీసం ఒక్కరోజైనా బ్రాహ్మణుని పిలిచి మంచి భోజనాన్ని పెట్టాలి.

* ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. అలాగే పూజ కూడా ముందే చేసినా కూడా మంచిదే.

* ఈ తొమ్మిది రోజుల్లో పూజలు చేసే మహిళలు మద్యన సమయంలో ఇంట్లో నిద్రించ రాదు. అది అరిష్టంగా భావిస్తారు. అలాగే మహిళలు కంట తడి కూడా పెట్టరాదు.

పైన తెలిపిన ఈ నియమాలను పాటిస్తూ దసరా నవరాత్రులు జరుపుకుంటే కష్టాలు తొలగి పోయి సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: