కాయగూరల తో పాటు మనకు దొరికే ఎటువంటి కాయలలో గుమ్మడి కాయ కూడా ఒకటి. ఇక ఇది దాదాపు రెండు సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది. బూడిద గుమ్మడికాయను మనం ఎక్కువగా ఏదైనా దృష్టి దోష నివారణకు గుమ్మం పైన వేలాడదీసి ఉంటాము. అయితే అలా వేలాడతీసిన కాయ కొద్దిరోజులకే పాడౌతూ ఉంటుంది. అందుకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నరదిష్టి ఎక్కువగా ఉన్నదని అర్థం.


నరదృష్టి పడకుండా ఉండేందుకు మన పెద్దలు కూడా గుమ్మడి కాయ, ఏదైనా దిష్టిబొమ్మను పెట్టామని చెబుతూ ఉంటారు. కానీ పండితులు మాత్రం బూడిద గుమ్మడికాయను ఇంటి ముందర దిష్టి గుమ్మడికాయ గా కడితే మంచిదని చెబుతున్నారు. లేదంటే ఐశ్వర్య కాళీ ఫోటోను ఇంటిలో/వ్యాపార సంస్థల్లో పెట్టుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోకు ప్రతిరోజు అగరబత్తీలు వెలిగించాలట. లేదంటే ఐశ్వర్య కాళీ మంత్రం ఫోటోకు ధూపం చూపించడం మంచిదట.

ఇలా చేయడం వల్ల నకారాత్మక శక్తి ఇంటి లోపలికి రాకుండా కాపాడుతుందట. మన ఇంటి మీద చూపించే నరదృష్టి మొత్తం గుమ్మడి కాయ, ఐశ్వర్య కాళీ లాగేసూ కుంటాయట. అలా ఏదైనా గుమ్మడికాయ పాడైపోయింది అంటే.. అప్పుడు మీ ఇంటికి నరదిష్టి తగిలినట్లు అని అర్థం. అందుచేతనే ఆ కాయ చెడిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు. వెంటనే ఆ తరువాత మరొక గుమ్మడికాయను పూజ చేయించుకొని కట్టాలట.

బాడుగ ఇంట్లో ఉన్నవారు కూడా గుమ్మడి కాయను కట్టుకుంటే మంచిదట. గుమ్మడికాయ ఉంటే కాలభైరవుడి తమకు రక్షణగా ఉన్నట్లు అని పండితులు తెలియజేస్తున్నారు. అందుచేతనే ఎప్పుడు ఈ గుమ్మడికాయ పై అశ్రద్ధ చూపకూడదు అని తెలియజేస్తున్నారు. గుమ్మడి కాయ మీద ఐశ్వర్య కాళీ మంత్రం ఫోటోని జోడిస్తే ఇంకా ఆసక్తి రెట్టింపు అవుతుందట. అప్పుడు సుఖసంతోషాలతో ఆ ఇల్లు/వ్యాపార సంస్థ ఉంటుందని తెలియజేస్తున్నారు.

ముఖ్య గమనిక: సంవత్సరానికి ఒకసారి గుమ్మడికాయలు మార్చడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: