మనకు విశేషమైన ధనయోగం కలగాలంటే మీ యొక్క జన్మ రాశిని బట్టి గాని నామ రాశిని బట్టి గాని ఈశ్వరుని ఎలా పూజించాలో  మనం ఇప్పుడు తెలుసుకుందాం..? పరమేశ్వరుని ఐశ్వర్య ఈశ్వరుడు అని పిలుస్తారు. అంటే మనకు శివుడు ధనయోగంన్ని కలిగించే దేవుడు అని అర్థం. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మొండి బాకీల సమస్యలు వృధా ఖర్చులు ఇవన్నీ తొలగిపోవాలంటే మీ జన్మరాశి ని బట్టి గానీ నామ రాశిని బట్టి గానీ శివుడికి ప్రత్యేకమైన అభిషేకం అనేది చేయాలి. అలాగే ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజ చేయాలి. ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా  సమర్పించాలి.

మేష రాశి వారు ఎవరైనా సరే బెల్లం ముక్క నీళ్లలో కలిపి శివుడికి అభిషేకం చేయండి. గన్నేరు పూలతో శివ పూజ చేయండి. శివుడికి తీపిపదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే మేష రాశి వారికి పరమేశ్వరుడు విశేష యోగాన్ని కలిగిస్తాడు. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే శివలింగాన్ని ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే, తెల్ల జిల్లేడు పూలతో, పంచదార నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మిధున రాశి వారు చెరుకు రసంతో అభిషేకం, గరికపోచలు, జమ్మి ఆకుల నుంచి నమస్కారం చేయాలి. పెసరపప్పు తో తయారు చేయబడ్డ పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే కర్కాటక రాశి వారు, ఈశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి, తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయాలి. అన్నము, పచ్చిపాలు నైవేద్యంగా పెట్టాలి. సింహ రాశి వారు శివుడికి అభిషేకం చేసేటప్పుడు బెల్లం ముక్క నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివాభిషేకం చేయాలి. శివుడిని ఎర్రటి మందార పూలతో పూజించాలి. శివుడి ప్రీతికోసం గోధుమ రవ్వతో తయారు చేసే పదార్థాలు నైవేద్యంగా పెడితే వారు విశేష ధన భాగ్యాన్ని పొందుతారు.

అలాగే కన్యారాశి వారు చెరకు రసంతో అభిషేకం చేసి, తమలపాకులతో శివ పూజ చేయాలి. పెసరపప్పు నైవేద్యంగా పెడితే వారికీ రాజయోగం కలుగుతుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొద్దిగా సెంటు నీళ్ళల్లో కలిపి వాటితో శివాభిషేకం చేయాలి. తెల్లని పుష్పాలతో పూజ చేసి, పెరుగుగాని తేనేగాని పాలకూర గాని నైవేద్యంగా సమర్పిస్తే వారికీ తిరుగులేని ధన యోగ ప్రాప్తి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: